Olympics 2024: మను భాకర్ చరిత్రను తిరగరాస్తుందా? - ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు ఇండియా షెడ్యూల్ ఇదే!
Olympics 2024: షూటింగ్‌లో హ్యాట్రిక్ మెడల్‌పై మను భాకర్ గురిపెట్టింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను భాకర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. నేడు జరుగనున్న ఫైనల్‌లో ఆమె పతకం దక్కించుకుంటే ఒకే ఒలింపిక్స్‌లో మూడు మెడల్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ అథ్లెట్‌గా నిలుస్తుంది.
Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లతో షూటింగ్ మినహా మిగిలిన భారత అథ్లెట్లునిరాశపరుస్తోన్నారు. పథకాలు సాధిస్తారని అనుకున్న పీవీ సింధు, నిఖత్ జరీన్ తో పాటు పలువురు స్టార్ అథ్లెట్లు ఇప్పటికే ఇంటి ముఖం పట్టారు. మరోసారి మను భాకర్‌పై క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మను భాకర్ హ్యాట్రిక్ పై గురిపెట్టింది.
నేడు ఫైనల్...
ఇరవై మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో సెకండ్ ప్లేస్‌లో నిలిచి సత్తా చాటింది. నేడు (శనివారం)జరుగనున్న ఫైనల్‌లో అదే జోరును కొనసాగించి మెడల్ సాధించేందుకు మను భాకర్ సిద్ధమైంది. ఈ సారి కాంస్యం కాకుండా గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ సాధించాలనే పట్టుదలతో మను భాకర్ కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ ఈవెంట్ జరగనుంది.
చరిత్రను తిరగరాస్తుందా...
మను భాకర్ మెడల్ సాధిస్తే ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన ఫస్ట్ ఇండియన్ అథ్లెట్‌గా చరిత్రను తిరగరాయడం ఖాయం కానుంది.
అలాగే షూటింగ్‌లో స్కీట్ మెన్స్, ఉమెన్స్ క్వాలిఫయర్ రౌండ్ పోటీలు జరుగనున్నాయి. ఇందులో మెన్స్ టీమ్ నుంచి అనంత్ జీత్ సింగ్, ఉమెన్స్ టీమ్ నుంచి రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహన్ బరిలో దిగనున్నారు.
ఆర్చరీ
వ్యక్తిగత ఈవెంట్స్‌లో దీపికా కుమారి, భజన్ కౌర్ పోటీ పడనున్నారు.
సెయిలింగ్ - డింగీ ఈవెంట్ నేత్రా కుమరన్, విష్ణు కుమరన్
గోల్ఫ్ - మూడో రౌండ్ పోటీలు - శుభాంకర్ శర్మ, గగన్ జీత్ భుల్లర్
48వ ప్లేస్‌లో ఇండియా...
ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించింది. ఈ మూడు మెడల్స్ షూటింగ్‌లోనే వచ్చాయి. ప్రస్తుతం పతకాల సంఖ్య పరంగా భారత్ 48వ ప్లేస్‌లో నిలిచింది. 31 మెడల్స్‌లో చైనా ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా...ఫ్రాన్స్ సెకండ్...ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి.
టోక్నో ఒలింపిక్స్‌లో ఇండియా ఏడు మెడల్స్ సాధించింది. ఓ గోల్డ్, రెండు సిల్వర్స్, నాలుగు కాంస్య పతకాలు దక్కించుకున్నది. అయితే ఈ సారి ఒలింపిక్స్‌లో ఆ రికార్డును దాటేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.