PAK vs SA T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌లో నేడు పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం బ్యాటింగ్ ఎంచుకున్నాడు.,పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్ గెలవడం తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు పాకిస్థాన్‌పై గెలిచి సెమీస్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకోవాలని సౌతాఫ్రికా బరిలో దిగుతోంది.,పాకిస్థాన్‌కు కెప్టెన్ బాబర్ ఆజాం ఫామ్ ఇబ్బందికరంగా మారింది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో బాబార్ రాణించలేదు. ఇప్పటికే ఓటములతో డీలా పడిన పాకిస్థాన్‌కు స్టార్ ప్లేయర్ ఫకర్ జమాన్ గాయంతో దూరం కావడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అతడి మహమ్మద్ హరీస్ వచ్చాడు. మరోవైపు మార్‌క్రమ్, రూసో వంటి హిట్టర్లతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. వారు చెలరేగితే పాకిస్థాన్‌కు కష్టాలు తప్పవు.,గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు హిట్టర్ డేవిడ్ మిల్లర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో క్లాసెన్ తుది జట్టులోకి వచ్చాడు. కేశవ్ మహరాజ్ స్థానంలో షంసీ టీమ్‌లోకి వచ్చాడు., ,