Pakistan vs Afghanistan: టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌.. ఆఫ్ఘనిస్థాన్‌ బ్యాటింగ్‌-pakistan vs afghanistan in asia cup as indian fans praying for afghan win ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pakistan Vs Afghanistan In Asia Cup As Indian Fans Praying For Afghan Win

Pakistan vs Afghanistan: టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌.. ఆఫ్ఘనిస్థాన్‌ బ్యాటింగ్‌

Hari Prasad S HT Telugu
Sep 07, 2022 07:19 PM IST

Pakistan vs Afghanistan Toss: ఆసియాకప్‌ సూపర్‌ 4 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ మధ్య కీలకమైన మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది.

టాస్ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కెప్టెన్లు నబీ, బాబర్ ఆజం
టాస్ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కెప్టెన్లు నబీ, బాబర్ ఆజం (AP)

Pakistan vs Afghanistan Toss: ఆసియా కప్‌లో భాగంగా బుధవారం (సెప్టెంబర్‌ 7) కీలకమైన మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్యే అయినా ఇండియాకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిస్తే ఇండియా మరో మ్యాచ్‌ మిగిలి ఉన్నా ఇంటిదారి పడుతోంది. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది పాకిస్థాన్‌.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్‌ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుండగా.. ఆఫ్ఘనిస్థాన్‌ ఒక మార్పు చేసింది. ఇండియాపై గెలిచిన టీమ్‌తోనే పాకిస్థాన్‌ ఆడాలని నిర్ణయించింది. ఇందులో పాకిస్థాన్‌ గెలిస్తే శ్రీలంకతోపాటు ఫైనల్‌ చేరుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌ గెలిస్తే ఫైనల్‌ రేసు ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ పాక్‌ గెలిస్తే ఇండియా ఫైనల్‌ ఆశలు గల్లంతవుతాయి.

అందుకే ఇందులో ఆఫ్ఘనిస్థాన్‌ గెలవాలని భారత అభిమానులు ప్రార్థిస్తున్నారు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో టాస్‌ గెలవడం పాకిస్థాన్‌కు కలిసొచ్చే విషయం. ఆసియా కప్‌లో చేజింగ్‌ టీమ్స్‌ రాణిస్తున్నాయి. ఇండియా సూపర్‌ ఫోర్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థి ముందు చాలెంజింగ్‌ టార్గెట్‌ ఉంచినా ఓడిపోయిన విషయం తెలిసిందే.

WhatsApp channel