Indian Spinners Pathetic: జడేజా, చాహల్ అసలు స్పిన్నర్లేనా? పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు
Indian Spinners Pathetic: టీమిండియా స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌పై పాకిస్థాన్ మాజీ అబ్దుర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ దారుణమైన స్పిన్నర్లంటూ స్పష్టం చేశాడు.
Indian Spinners Pathetic: టీమిండియా స్పిన్ విభాగం ఆరంభం నుంచి పటిష్ఠంగా ఉంది. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు భారత్ సొంతం. తమ ప్రదర్శనతో వరల్డ్ క్రికెట్‌ను శాసించారు. చాలా కాలంగా స్పిన్ విభాగంలో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుందంటే మెరుగైన స్పిన్ బౌలర్లు ఉండటమే కాకుండా. ప్రస్తుత తరంలో రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుర్ రెహమాన్ మాత్రం భారత స్పిన్నర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చాహల్, జడేజా దారుణమైన స్పిన్నర్లని స్పష్టం చేశాడు.
భారత్‌లో వరస్ట్ స్పిన్నర్ ఎవరనే ప్రశ్నను అబ్దుర్ రెహమాన్ అడుగ్గా.. అతడు మొదట్లో సమాధానమివ్వలేదు. ఓ దేశానికి ప్రాతినిధ్యం వహించే ఏ స్పిన్నర్ కూడా వరస్ట్ కాదని స్పష్టం చేశాడు. అయితే అనంతరం మాట్లాడుతూ జడేజా, యజువేంద్ర చాహల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
"కెరీర్ ఆరంభంలో జడేజా దారుణమైన బౌలర్. అతడు ధోనీ కెప్టెన్సీలో రాటు దేలాడు. అతడు ఎంతగా కష్టపడ్డాడంటే ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా ఎదికాడు. ఇక చాహల్ దగ్గరకొస్తే అతడు హార్రిబుల్ స్పిన్నర్. అతడి బౌలింగ్‌లో చాలా సులభంగా పరుగులు రాబట్టవచ్చు. డెలివరీల్లో ఎలాంటి వేగమూ ఉండదు. అలాగే బంతిని స్పిన్ కూడా చేయడు. అతడు ఎక్కువ కాలం రాణించలేడు." అని అబ్దుర్ రెహమాన్ స్పష్టం చేశాడు.
రవీంద్ర జడేజా తన అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతం గణాంకాలను నమోదు చేశాడు. 62 టెస్టులు ఆడిన అతడు 259 వికెట్లు తీశాడు. అంతేకాకుండా 171 వన్డేల్లో 189 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో 64 టీ20లు ఆడి 51 వికెట్లు తీశాడు. మరోపక్క చాహల్ 72 వన్డేల్లో 121 వికెట్లు తీయగా.. 75 టీ20ల్లో 91 వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం