Padma Awards 2025: శ్రీజేశ్‍కు పద్మ విభూషణ్, అశ్విన్‍కు పద్మశ్రీ.. క్రీడారంగంలో మరో ముగ్గురికి..
Padma Awards for Sports: భారత హాకీ మాజీ ప్లేయర్ పీఆర్ శ్రీజేశ్‍కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‍ను పద్మశ్రీ అవార్డు వరించింది. క్రీడారంగంలో ఎవరికి అవార్డులు దక్కాయంటే..
భారత హాకీ మాజీ గోల్‍కీపర్, ఒలింపిక్స్ హీరో పీఆర్ శ్రేజేశ్‍కు గుర్తింపు లభించింది. పద్మభూషణ్ అవార్డు అతడికి లభించింది. వరుసగా 2021, 2024 రెండు ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకం సాధించడంలో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. క్రీడారంగానికి సేవలకు స్టార్ ప్లేయర్ శ్రీజేశ్‍ను దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారం పద్మభూషణ్‍కు భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025కు గాను పద్మ అవార్డులను నేడు (జనవరి 25) ప్రభుత్వం ప్రకటించింది. క్రీడారంగంలో ఐదుగురిని పద్మ అవార్డులకు ఈఏడాది ఎంపిక చేసింది.

అశ్విన్‍కు పద్మశ్రీ
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‍కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍కు పద్మశ్రీ అవార్డు దక్కింది. తమిళనాడు నుంచి పురస్కారానికి అతడు ఎంపికయ్యాడు. టీమిండియా తరఫున 106 టెస్టులు ఆడిన అశ్విన్ 537 వికెట్లు పడగొట్టాడు.
116 వన్డేల్లో 156 వికెట్లు, 65 అంతర్జాతీయ టీ20ల్లో 72 వికెట్లు దక్కించుకున్నాడు అశ్విన్. 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో అతడు ఉన్నాడు. భారత్‍ను తన స్పిన్ మాయాజాలంతో ఎన్నో మ్యాచ్‍ల్లో గెలిపించాడు. బ్యాటింగ్‍లోనూ చాలాసార్లు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత క్రికెట్ చరిత్ర ఓ దిగ్గజంలా నిలిచాడు అశ్విన్. అతడికి ఇప్పుడు పద్మశ్రీ దక్కింది.
శ్రీజేశ్ ఓ లెజెండ్
మాజీ కెప్టెన్ పీఆర్ శ్రేజేశ్.. భారత హాకీ చరిత్రలో గ్రేటెస్ట్ వికెట్ కీపర్‌గా నిలిచాడు. 18 ఏళ్ల కెరీర్లో 336 మ్యాచ్‍లు ఆడాడు శ్రీజేశ్. చాలా మ్యాచ్‍ల్లో టీమిండియా గెలువడంలో కీలకంగా మారాడు గెలిపించాడు. రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించడంలో కీరోల్ పోషించాడు. ప్రస్తుతం భారత హాకీ జూనియర్ మెన్స్ టీమ్ హెచ్‍కోచ్‍గా విధులు నిర్వర్తిస్తున్నాడు శ్రీజేశ్. అతడి ఘనమైన కెరీర్‌కు హర్యానా నుంచి పద్మభూషణ్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఈ ముగ్గురికి కూడా..
భారత దిగ్గజ ఫుట్‍బాల్ ప్లేయర్ ఐ మణి విజయన్‍కు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. కేరళ నుంచి నామినేట్ అయిన ఆయనను పురస్కారం వరించింది. భారత్ తరఫున పారాలింపిక్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తొలి ఆర్చర్‌గా చరిత్ర సృష్టించిన హర్విందర్ సింగ్‍కు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. హర్యానా నుంచి హర్విందర్ అవార్డు అందుకోనున్నారు. పారాలింపిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్‍ను కూడా పద్మశ్రీకి కేంద్ర ఎంపిక చేసింది.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.
సంబంధిత కథనం