Chahal On RCB : ఆర్సీబీపై చాహల్ గరం గరం.. జట్టు మీద సెన్సెషనల్ కామెంట్స్-no phone call or communication i was very angry yuzvendra chahal sensational comments on rcb ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Chahal On Rcb : ఆర్సీబీపై చాహల్ గరం గరం.. జట్టు మీద సెన్సెషనల్ కామెంట్స్

Chahal On RCB : ఆర్సీబీపై చాహల్ గరం గరం.. జట్టు మీద సెన్సెషనల్ కామెంట్స్

Anand Sai HT Telugu

Yuzvendra Chahal On RCB : ఐపీఎల్ లో యజ్వేంద్ర చాహల్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో వికెట్లు తీసిన ఆటగాడిగా చాహల్ నిలిచాడు. అయితే తాజాగా ఆర్సీబీపై సెన్సెషనల్ కామెంట్స్ చేశాడు.

యజువేంద్ర చాహల్ (twitter)

ఐపీఎల్(IPL) సిరీస్‌లో ఆర్‌సీబీ తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. తన విడుదలకు సంబంధించి ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చాహల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) నిలిచాడు. చాహల్ 145 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. టీమిండియాలోనూ కచ్చితత్వంతో బౌలింగ్ చేయగల సత్తా అతనికి ఉంది. గత 2 సంవత్సరాలుగా రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు. జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నాడు.

చాహల్ రాజస్థాన్ జట్టు కంటే ముందు బెంగళూరు జట్టుకు విలువైన ఆటగాడిగా ఉండేవాడు. బౌలర్లందరూ పరుగులు ఇస్తున్నా.. చాహల్ మాత్రం.. తన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్లను భయపెట్టేవాడు. RCB జట్టుకు శాశ్వత ఆటగాడిగా ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ బెంగళూరు జట్టు 2022లో చాహల్ విడుదల చేసింది. దీంతో మెగా వేలంలో పాల్గొన్నాడు. దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

RCB జట్టు కోసం విడుదలైన సంఘటన గురించి చాహల్ మాట్లాడాడు. 'బెంగళూరు జట్టు కోసం 110 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. కానీ నేను 2022లో విడుదలైనప్పుడు యాజమాన్యం నుండి ఎటువంటి సమాచారం లేదు. ఒక్క ఫొన్ కాల్ లేదు. మెగా వేలంలో నా కోసం ఎంతకైనా వస్తారు అనుకున్నాను. నేను దాదాపు 8 సంవత్సరాలు RCB కోసం ఆడాను. వారు నన్ను తిరిగి కొనుగోలు చేయలేదని కోపంగా ఉంది. ఆ సమయంలో నేను ఎక్కువ మొత్తం అడిగానని పుకార్లు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదు. నా విలువ ఏంటో నాకు బాగా తెలుసు. మెగా బిడ్ తర్వాత జట్టులోని ఎవరితోనూ RCB మాట్లాడలేదు. ఆర్‌సీబీతో ఆడేటప్పుడు కూడా ఆ జట్టు కోచ్‌లతో మాట్లాడలేదు.' అని చాహల్ చెప్పాడు.

అలాగే చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium) ఎప్పుడూ తనకు ఇష్టమేనని తెలిపాడు చాహల్. తనకు తెలిసినంత వరకు, విరాట్ కోహ్లీ(Virat Kohli) మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మైదానం వెలుపల పూర్తిగా వ్యతిరేకమని చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం నుండి ఎటువంటి పిలుపు లేకుండా యుజ్వేంద్ర చాహల్‌ను విడుదల చేయడం కోపానికి కారణమైంది. యుజ్వేంద్ర చాహల్ ఇటీవలి ఇంటర్వ్యూలో RCB మేనేజ్‌మెంట్ తనను విడుదల చేయాలని నిర్ణయించుకునే ముందు తనతో మాట్లాడలేదని వాపోయాడు.

రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చాహల్ 27 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పుడు యుజ్వేంద్ర చాహల్ 2023 IPLలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. రాబోయే వన్డే ప్రపంచకప్‌(ODI World Cup)లో భారత్‌కు అతిపెద్ద ఆశ అతడే. భారత్‌లో జరిగే ఐసీసీ(ICC) టోర్నీలో యుజ్వేంద్ర చాహల్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.