India vs New Zealand 3rd ODI: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా చివరి వన్డే ఆడుతోంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఆతిథ్య జట్టే టాస్ గెలవడం గమనార్హం. ఈ సిరీస్ అంతా వర్ష ప్రభావితం కావడంతో ఈ చివరి వన్డే నిర్ణాయత్మకంగా మారింది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన న్యూజిలాండ్ 0-1 తేడాతో ముందంజలో ఉంది. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో కీలక మూడో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సమమవుతుంది. లేదంటే సిరీస్ ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంటుంది.,టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రెండో వన్డేలో ఏ జట్టుతోనైతే బరిలో దిగిందో.. అదే టీమ్‌తో ఆడుతోంది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం ఓ మార్పు చేసింది. బ్రేస్‌వెల్ స్థానంలో ఆడం మిల్నేకు అవకాశమిచ్చింది.,సిరీస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఎటు లేదు.. కనీసం సమం చేసే అవకాశాన్నైనా వదులుకోకూడదని భారత్ భావిస్తోంది. తొలి వన్డేలో 306 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన్ టీమిండియాలో బౌలర్లు పుంజుకోవాల్సి ఉంది. ఐదుగురు మాత్రమే బౌలర్లు ఉండటం, ఆరో ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా గట్టిగానే దెబ్బతీసింది. దీంతో రెండో వన్డేలో సంజూ స్థానంలో దీపక్ హుడాను తీసుకుంది. అయితే ఆ మ్యాచ్ 12.5 ఓవర్లు మాత్రమే జరగడంతో అతడికి బౌలింగ్ ఛాన్స్ రాలేదు. మరి ఈ సారైనా ఇస్తారో లేదో చూడాలి.,మరోపక్క రిషభ్ పంత్ తన ఫామ్‌ను పుంజుకోవాల్సి ఉంది. ధావన్ కూడా ధాటిగా ఆడాల్సి ఉంది. పవర్ ప్లే వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టుకోవాలి. టీమిండియా పేసర్లు పుంజుకుని కివీస్‌కు కళ్లెం వేయాలి. లేదంటే సిరీస్ సమర్పించుకోవాల్సి వస్తుంది.,తుది జట్లు..భారత్..శిఖర్ ధావన్(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్.,న్యూజిలాండ్..ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడం మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గ్యూసన్.,