Colin De Grandhomme Retirment: కివిస్ ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ రిటైర్మెంట్ ప్రకటన.. కారణం ఇదే
Colin De Grandhomme Announces Retirement: కివీస్ క్రికెటర్ కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. . గ్రాండ్‌హోమ్ 29 టెస్టుల్లో 38.70 సగటుతో 1432 పరుగులు చేశాడు. ఇందులో దక్షిణాఫ్రికా, సౌతాఫ్రికాపై చేసిన రెండు శతకాలు కూడా ఉన్నాయి.
Colin De Grandhomme Announces Retirement: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. బుధవారం నాడు తాను క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు గ్రాండ్‌హోమ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని కివీస్ క్రికెట్ అధికారిక ట్విటర్ ద్వారా తెలియజేసింది. తనను సెంట్రల్ కాంట్రాక్ట్ బోర్డు నుంచి విడుదల చేయమని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ తరఫున తాను ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని గ్రాండ్‌హోమ్ తెలిపాడు. 36 ఏళ్ల వయస్సున్న తనకు శారీరకంగా ఇబ్బందిగా ఉందని, అంతేకాకుండా తరచూ గాయాలతో సతమతమవుతున్నానని స్పష్టం చేశాడు. అందువల్ల అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నానని తెలిపాడు.
"న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై పలికాడు" అని కివీస్ క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా తెలియజేసింది. గ్రాండ్‌హోమ్ 29 టెస్టుల్లో 38.70 సగటుతో 1432 పరుగులు చేశాడు. ఇందులో దక్షిణాఫ్రికా, సౌతాఫ్రికాపై చేసిన రెండు శతకాలు కూడా ఉన్నాయి. టెస్టుల్లో ఇతడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు వచ్చేసి 120 నాటౌట్. అంతేకాకుండా బౌలింగ్‌లో 32.95 సగటుతో 49 వికెట్లు పడగొట్టాడు. ఇవి కాకుండా 45 వన్డేలు, 41 టీ20ల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది.
నేను చిన్నవాడిని కాదని అభిప్రాయపడుతున్నాను. వయస్సు కారణంగా శిక్షణ కష్టంగా మారింది. ముఖ్యంగా గాయాలను నేను అంగీకరిస్తున్నాను. నాకు కూడా కుటుంబం ఉంది. క్రికెట్ తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇవన్నీ గత కొన్ని వారాలుగా నా మదిలో మెదులుతున్నాయి. 2012లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్లాక్ క్యాప్స్(న్యూజిలాండ్ క్రికెట్)కు ఆడే అవకాశం లభించినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. అని రిటైర్మెంట్ అనంతరం గ్రాండ్‌హోమ్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం
టాపిక్