Telugu News  /  Sports  /  Netizens Troll On Kl Rahul As His Poor Form Continues In T20 World Cup
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్

Netizens Troll on KL Rahul:కేఎల్ రాహుల్ పెద్ద మోస‌గాడు - దారుణంగా ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

31 October 2022, 11:30 ISTNelki Naresh Kumar
31 October 2022, 11:30 IST

Netizens Troll on KL Rahul: ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో విఫ‌ల‌మైన టీమ్ ఇండియా ఓపెన‌ర్ కె.ఎల్ రాహుల్‌ను సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మీమ్స్‌, ట్రోల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Netizens Troll on KL Rahul: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతోన్న టీమ్ ఇండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌ను నెటిజ‌న్లు దారుణంగా ఆడుకుంటున్నారు. ట్రోల్స్‌, మీమ్స్‌తో అత‌డిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇప్ప‌టివ‌ర‌కు టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌లు ఆడింది. ఈ మూడింటిలో కేఎల్ రాహుల్ విఫ‌ల‌య్యాడు. క‌నీసం ఒక్క మ్యాచ్‌లో కూడా డ‌బుల్ డిజిట్ స్కోరు అందుకోలేక‌పోయాడు.

ట్రెండింగ్ వార్తలు

పాకిస్థాన్‌పై నాలుగు ప‌రుగులు, నెద‌ర్లాండ్స్‌పై తొమ్మిది ప‌రుగులు మాత్ర‌మే చేసి రాహుల్ ఔట‌య్యాడు. ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో త‌న పేవ‌ల ఫామ్‌ను కొన‌సాగిస్తూ 14 బాల్స్‌లో 9 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. పార్నెల్ వేసిన తొలి ఓవ‌ర్‌ను రాహుల్ మెయిడిన్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లో త‌బ‌బ‌డిన రాహుల్ ఎంగిడి బౌలింగ్‌లో మార్‌క్ర‌మ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓట‌మి పాల‌వ్వ‌డంతో రాహుల్‌ను నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. ఇండియ‌న్ క్రికెట్‌లో కేఎల్ రాహుల్ పెద్ద మోస‌గాడు అంటూ ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ ద్వారా మ‌రోసారి ఆ విష‌యం నిరూపిత‌మైంద‌ని పేర్కొన్నాడు.

త‌క్ష‌ణ‌మే కె.ఎల్ రాహుల్‌ను అన్ని ఫార్మెట్ల నుంచి తొల‌గించాల‌ని మ‌రో ఫ్యాన్ ట్వీట్ చేశాడు. అత‌డి వ‌ల్ల ఇండియ‌న్ క్రికెట్ అభిమానులు ఇప్ప‌టివ‌ర‌కు బాధ‌ప‌డింద‌ని చాలాని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ కంటే త‌న ఓపెన‌ర్ బెట‌ర్ అంటూ బాటిల్ ఓపెన‌ర్ ఫొటోను మ‌రో నెటిజ‌న్ పోస్ట్ చేశాడు.

డ‌కౌట్ కావ‌నే మా న‌మ్మ‌కాన్ని మ‌రోసారి త‌ప్పు అని నిరూపించావు అంటూ మ‌రో నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. కె.ఎల్ రాహుల్ ఉద్దేశించి నెటిజ‌న్లు చేస్తోన్న ట్వీట్స్ మీమ్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.