Mumbai Indians Captain: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
Mumbai Indians Captain: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ను నియమించింది ఆ ఫ్రాంఛైజీ. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా ముంబై టీమ్ ఆమెను రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Mumbai Indians Captain: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్ దగ్గర పడింది. ఐదు టీమ్స్ తో తొలి డబ్ల్యూపీఎల్ మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లోని మూడు టీమ్స్ ను ఐపీఎల్ ఫ్రాంఛైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ముంబై ఇండియన్స్ కూడా ఒకటి. తాజాగా బుధవారం (మార్చి 1) ఈ టీమ్ కెప్టెన్ ను అనౌన్స్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అయిన హర్మన్‌ప్రీత్ కౌర్ నే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమించింది. ఈ మధ్యే వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ ను సెమీఫైనల్ వరకూ తీసుకెళ్లింది హర్మన్. ఇక మహిళల క్రికెట్ లో 150 టీ20లు ఆడిన తొలి ప్లేయర్ అయిన హర్మన్ ను వేలంలో రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై టీమ్.
అటు ఇప్పటికే ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ ను ఐపీఎల్లో ఇండియన్ మెన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ లీగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఇండియన్ టీమ్స్ కెప్టెన్లే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్లు అయ్యారు. హర్మన్ ను కెప్టెన్ గా నియమించడం చాలా సంతోషంగా ఉందని ముంబై టీమ్ ఓనర్ నీతా అంబానీ అన్నారు.
"నేషనల్ టీమ్ కెప్టెన్ గా ఇండియన్ టీమ్ ను హర్మన్ కొన్ని అద్భుతమైన విజయాలు సాధించి పెట్టింది. చార్లెట్, ఝులన్ మద్దతుతో ఇప్పుడు హర్మన్ ముంబై ఇండియన్స్ టీమ్ లోనూ స్ఫూర్తి నింపుతుందని భావిస్తున్నాను. ముంబై ఇండియన్స్ కొత్త ఛాప్టర్ కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నాను" అని నీతా చెప్పారు.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ ఉన్న విషయం తెలిసిందే. మార్చి 4 నుంచి మార్చి 26 వరకు ముంబైలో తొలి డబ్ల్యూపీఎల్ జరగనుంది.
సంబంధిత కథనం