IPL 2023 Final : రాయుడుకు ట్రోఫీ ఇప్పించిన ధోనీ.. అందుకే నువ్ మనసులు గెలుస్తావ్-ms dhoni give chance to ambati rayudu for lift ipl 2023 trophy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ms Dhoni Give Chance To Ambati Rayudu For Lift Ipl 2023 Trophy

IPL 2023 Final : రాయుడుకు ట్రోఫీ ఇప్పించిన ధోనీ.. అందుకే నువ్ మనసులు గెలుస్తావ్

Anand Sai HT Telugu
May 30, 2023 10:22 AM IST

MS Dhoni : వరల్డ్ కప్ అయినా.., ఐపీఎల్ కప్ అయినా.. ప్లేయర్స్ చేతికి గెలిచిన కప్ ఇస్తేనే ధోనీకి ఆనందం. ఇలా తాజాగా మరోసారి నెటిజన్ల మనసు దోచుకున్నాడు ధోనీ.

ఐపీఎల్ ట్రోఫీతో రాయుడు, జడేజా
ఐపీఎల్ ట్రోఫీతో రాయుడు, జడేజా (CSK)

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అయితే ఈ రికార్డు సృష్టించినప్పటికీ.. ధోనీ చేసిన పని మరోసారి అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ధోనీ అంటే ఇదే కదా అనిపించేలా చేసింది. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మీద చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. దీని తర్వాత ట్రోఫీ అందుకునేందుకు ధోనీ వెళ్లాల్సి ఉంది. అయితే అతడితో పాటుగా అంబటి రాయుడు, జడేజాలను కూడా తీసుకెళ్లాడు. ఐపీఎల్ 2023 ట్రోఫీని వారికే ఇప్పించాడు. దీంతో నెటిజన్లు మరోసారి ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

జట్టు విజయం సాధించినప్పుడు కప్ తీసుకుంటే అదో కిక్కు. అలాంటిది ధోనీ తీసుకోకుండా.. తోటి ఆటగాళ్లకు ఇప్పించడం అందరినీ మరోసారి ఆశ్చర్యానికి గురిచేసింది. ధోనీ అంటే ఇదే కదా అనుకుంటున్నారు. ధోనీ విలక్షణమైన పద్ధతికి మరోసారి సెల్యూట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అతడి కెరీర్లో చివరిది. ఐపీఎల్ ఫైనల్స్ లో గెలిచేందుకు జడేజా కీలక పాత్ర పోషించాడు. 2 బంతుల్లో 10 పరుగులు చేసి CSK టైటిల్ గెలించేందుకు కారణమయ్యాడు. ఒకవేళ ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అయినా కావొచ్చు. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. దాదాపు ఇదే ధోనీకి కూడా చివరి ఐపీఎల్(IPL) అన్నట్టుగానే చెబుతున్నారు. అలాంటిది తాను.. కప్ తీసుకోకుండా..తోటి ఆటగాళ్లకు ఇప్పించడంపై ధోనీ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌లో, ధోని అంబటి రాయుడు గురించి మాట్లాడాడు. 'రాయుడు ప్రత్యేకత ఏమిటంటే, అతను తన ఫీల్డ్‌లో ఉన్నప్పుడు 100 శాతం ఇస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ జట్టుకు సహకరించాలని కోరుకుంటాడు. అతను అద్భుతమైన క్రికెటర్. నేను అతనితో చాలా కాలంగా ఆడుతున్నాను. అతను స్పిన్ మరియు పేస్ సమానంగా ఆడగల ఆటగాడు. ఇది నిజంగా ప్రత్యేకమైనది. ఈ గేమ్ రాయుడికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అతను కూడా నా లాంటి వాడు.. ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వ్యక్తి కాదు. రాయుడి మంచి కెరీర్‌ను కలిగి ఉన్నాడు. తన జీవితంలోని తదుపరి దశను ఆనందిస్తాడని ఆశిస్తున్నాను.' అని ధోనీ మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్‌లో చెప్పాడు.

WhatsApp channel