FIFA 2030 Dogs Stray: 30 లక్షల కుక్కలను చంపేందుకు ప్రభుత్వ ప్రణాళిక.. కారణం ఇదే!
30 Lakh Dogs Mass Killing Before FIFA World Cup 2030: మొరాకో ప్రభుత్వం సుమారుగా 30 లక్షల వీధి కుక్కలను సాముహికంగా చంపేందుకు ప్లాన్ వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2030 కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొరాకో సర్కారు ప్రకటించింది. దీంతో నలుదిక్కులా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
30 Lakh Dogs Killing FIFA World Cup 2030: స్పెయిన్, పోర్చుగల్‌లతో కలిసి 2030 ఫిఫా వరల్డ్ కప్‌కు మొరాకో ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో మూడు మిలియన్ అంటే, దాదాపుగా 30 లక్షల వీధి కుక్కలను చంపే ప్రణాళికలను మొరాకో ప్రభుత్వం ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు
దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రతిష్టాత్మక ఫిఫా 2030 టోర్నమెంట్ కోసం, పర్యాటక ఆకర్షణను పెంచుకునేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలపై జంతుసంక్షేమ సంస్థలు, ఉద్యమకారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడానికి మొరాకో అధికారులు అమానవీయ పద్ధతులను అవలంబిస్తున్నారని డైలీ మెయిల్ నివేదికలు చెబుతున్నాయి.
అత్యంత విషపూరితమైన
కుక్కలకు విషమివ్వడానికి, అత్యంత విషపూరితమైన స్ట్రైక్నైన్‌ను ఉపయోగించడం, కొన్ని సందర్భాల్లో బహిరంగ ప్రదేశాలలో కాల్చడం, బతికి ఉన్న జంతువులను పారలతో కొట్టి చంపడం వంటి పద్ధతులతో చంపనున్నారని ఆ నివేదికలు తెలిపాయి. ఈ క్రూరమైన ఎత్తుగడలపై ప్రపంచవ్యాప్తంగా జంతు హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఫిఫా జోక్యం చేసుకోవాలి
ఈ ప్రచారంలో భాగంగా 30 లక్షల కుక్కలను చంపే అవకాశం ఉందని అంతర్జాతీయ జంతు సంక్షేమ, రక్షణ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రఖ్యాత ప్రైమటాలజిస్ట్, జంతు హక్కుల న్యాయవాది జేన్ గూడాల్ ఈ క్రూరమైన పద్ధతులను ఖండించారు. అంతేకాకుండా ఇందులో ఫిఫా జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ హత్యలు కొనసాగితే మొరాకో ఆతిథ్య బాధ్యతలను నిలిపివేయాలని, హత్యలను ఆపడానికి ఫిఫా వెంటనే చర్యలు తీసుకోవాలని గూడాల్ పుట్‌బాల్ గవర్నింగ్ బాడీకి రాసిన బహిరంగ లేఖలో కోరారు.
చట్టాలను ఉల్లంఘించి
మొరాకోలో వీధి కుక్కలను చంపడాన్ని నిషేధించే చట్టపరమైన ఫ్రేమ్ వర్క్‌లు ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు ఈ చర్యలను కొనసాగిస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. తరచుగా చట్టపరమైన జోక్యం లేకుండా, స్థానిక చట్ట అమలు సంస్థ హింసను పట్టించుకోలేదని, జంతు సంక్షేమ సంస్థల పరిస్థితిని మరింత జటిలం చేసిందని ఆరోపించారు.
జనసమూహం ఉన్న చోట్లోనే
ట్రాప్-న్యూటర్-వ్యాక్సినేట్-రిలీజ్ (టీఎన్వీఆర్) వంటి మానవీయ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించే ఈ సమూహాలు ఇలా పెరుగుతున్న వీధి కుక్కల మాస్ కిల్లింగ్‌ను నియంత్రించేందుకు పోరాడుతున్నప్పుడు అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. ఈ హింస అనేది ఎక్కువ జన సమూహం ఉన్న బస్ షెల్టర్స్ వంటి చోట్లనే జరుగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే జంతువులు ఎక్కువగా బస్ షెల్టర్స్, పార్క్‌ల్లోనే ఉంటాయి.
పర్యవేక్షిస్తోన్న ఫిఫా
అయితే, అందుకు కుక్కలను చంపడానికి బదులుగా తగిన పరిష్కారాలను అందించడానికి లోకల్ సంస్థలు కష్టపడుతున్నాయి. అయితే, ఈ అంశంపై ఫిఫా ఇంకా అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. కానీ, ఈ పరిస్థితిని ఫిఫా నిశితంగా పర్యవేక్షిస్తోందని వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలకు
మొరాకోలో ప్రతిపాదిత ప్రపంచ కప్ వేదికల వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి, తీసుకున్న ఏదైనా చర్య అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ అమానవీయ చర్యను ప్రపంచ సమాజం నిశితంగా గమనిస్తోంది. అలాగే, వీధి కుక్కలను నియంత్రించడానికి మొరాకో అధికారులు మానవీయ, స్థిరమైన విధానాలను అవలంబించాలని సూచిస్తున్నాయి.