Telugu News  /  Sports  /  Mitchell Johnson Pushes Yusuf Pathan During Legends League Cricket Match
యూసుఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ మధ్య వాగ్వాదం
యూసుఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ మధ్య వాగ్వాదం (Legends League Cricket)

Mitchell Johnson pushes Yusuf Pathan: యూసుఫ్‌ పఠాన్‌ను తోసేసిన మిచెల్‌ జాన్సన్‌.. వీడియో వైరల్‌

03 October 2022, 13:40 ISTHari Prasad S
03 October 2022, 13:40 IST

Mitchell Johnson pushes Yusuf Pathan: యూసుఫ్‌ పఠాన్‌ను తోసేశాడు మిచెల్‌ జాన్సన్‌. లెజెండ్స్‌ లీగ్‌ ఆఫ్‌ క్రికెట్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.

Mitchell Johnson pushes Yusuf Pathan: జెంటిల్మెన్‌ గేమ్‌గా క్రికెట్‌కు పేరున్నా అప్పుడప్పుడూ క్రికెటర్ల మధ్య ఫీల్డ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉంటాయి. అయితే ఇప్పటికే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్లేయర్స్‌ కూడా ఇలా ఫీల్డ్‌లో మాటామాటా అనుకొని అది కాస్తా చేతులు చేసుకునే స్థాయికి రావడం విచిత్రమే.

ట్రెండింగ్ వార్తలు

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో భాగంగా భిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు యూసుఫ్‌ పఠాన్‌, మిచెల్‌ జాన్సన్‌ మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం జరిగింది. తనపైకి దూసుకొచ్చిన పఠాన్‌ను జాన్సన్‌ వెనక్కి తోసేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాదు ఇలా చేయి చేసుకున్న జాన్సన్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం విధించే అవకాశం కూడా ఉంది.

యూసుఫ్‌ vs జాన్సన్‌.. అసలేం జరిగింది?

ఈ మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్ భిల్వారా కింగ్స్‌కు ఆడుతున్నాడు. ఇండియా క్యాపిటల్స్‌కు ఆడుతున్న జాన్సన్‌ వేసిన 19వ ఓవర్‌ తొలి మూడు బాల్స్‌కు 6,4, 6 కొట్టాడు యూసుఫ్‌. ఆ తర్వాత బంతికి మరో భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. ఈ సమయంలో జాన్సన్‌ ఏదో అనడంతో పెవిలియన్‌ వైపు వెళ్తున్న యూసుఫ్‌ పఠాన్‌ తిరిగి వచ్చి జాన్సన్‌పై దూసుకెళ్లాడు.

దీంతో జాన్సన్‌ అతన్ని వెనక్కి నెట్టేశాడు. గొడవ పెద్దదవుతుండటంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు. అయినా యూసుఫ్‌ పఠాన్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. జాన్సన్‌కు మాటలతో బదులిస్తూనే ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జాన్సన్‌ 4 ఓవర్లలోనే 51 రన్స్‌ ఇచ్చాడు. అయితే చివరికి మ్యాచ్‌లో మాత్రం జాన్సన్‌ టీమ్‌ ఇండియా క్యాపిటల్స్‌ 4 వికెట్లతో గెలిచి ఫైనల్‌ చేరింది.

ఈ మ్యాచ్‌లో పఠాన్‌ మెరుపులతో మొదట భిల్వారా కింగ్స్ 226 రన్స్‌ చేసింది. అయితే ఆ తర్వాత వాట్సన్‌, పోర్టర్‌ఫీల్డ్‌ చెలరేగడంతో ఇండియా క్యాపిటల్స్‌ మరో మూడు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్‌ చేజ్‌ చేయడం విశేషం. అయితే భిల్వారా కింగ్స్‌ మరో మ్యాచ్‌లో గుజరాత జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ విజేత ఫైనల్‌ చేరుతుంది. ఆ లెక్కన ఫైనల్లో మారోసారి యూసుఫ్‌ పఠాన్‌, మిచెల్‌ జాన్సన్‌ ఒకరికొకరు ఎదురుపడే అవకాశం ఉంది.

టాపిక్