Mayank Agarwal In Ranji Trophy: 9 మ్యాచుల్లో 990 రన్స్ - రంజీ సీజన్‌లో టాప్ స్కోరర్‌గా మయాంక్ అగర్వాల్
Mayank Agarwal In Ranji Trophy: రంజీ ట్రోఫీ 2022 - 23 సీజన్‌లో హయ్యెస్ట్ స్కోరర్‌గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు. 9 మ్యాచుల్లోనే 990 పరుగులు చేసినా తన జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయాడు.

Mayank Agarwal In Ranji Trophy: రంజీ ట్రోఫీ 2022 -23 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ అదరగొట్టాడు. ఈ సీజన్‌లో హయ్యెస్ట్ రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రస్తుతం కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న మయాంక్ 9 మ్యాచుల్లో 990 పరుగులు చేశాడు 82.50 యావరేజ్‌తో మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు మయాంక్ అగర్వాల్.
ధృవ్ షోరే 859 పరుగులతో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. సచిన్ బేబీ (830 రన్స్), అర్పిత్ వసవాడ (826 రన్స్). అనుస్ట్రప్ ముజుందార్ (790 రన్స్) టాప్ ఫైవ్‌లో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ టీమ్ ఇండియాకు దూరమై చాలా కాలమైంది. ఫామ్ లేమితో నేషనల్ టీమ్‌లో స్థానాన్ని కోల్పోయిన అతడు రంజీ సీజన్‌లో రాణించి మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
డబుల్ సెంచరీ వృథా…
సౌరాష్ట్రలో జరిగిన సెమీ ఫైనల్‌లో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 429 బంతుల్లో 249 రన్స్ చేసి సత్తా చాటాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 55 పరుగులు చేశాడు. కానీ అతడి బ్యాటింగ్ మెరుపులు వృథాగా మారాయి.
ఈ మ్యాచ్‌లో కర్నాటకపై నాలుగు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విజయాన్ని అందుకున్నది. ఈ విజయంతో సౌరాష్ట్ర ఫైనల్ చేరుకుంది. టైటిల్ కోసం బెంగాళ్‌తో తలపడనుంది. రంజీ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది.
టాపిక్