Mark Waugh vs Dinesh Karthik: ఆసీస్ మాజీకి కోపం తెప్పించిన దినేశ్ కార్తిక్.. సరదాగా మొదలైన మాటల యుద్ధం-mark waugh vents his frustration clashes with dinesh karthik during 2nd test against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Mark Waugh Vents His Frustration, Clashes With Dinesh Karthik During 2nd Test Against Australia

Mark Waugh vs Dinesh Karthik: ఆసీస్ మాజీకి కోపం తెప్పించిన దినేశ్ కార్తిక్.. సరదాగా మొదలైన మాటల యుద్ధం

Maragani Govardhan HT Telugu
Feb 20, 2023 12:19 PM IST

Mark Waugh vs Dinesh Karthik: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కామేంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీ మార్క్ వా- దినేశ్ కార్తిక్ మధ్య సరదాగా మొదలైన మాటలు సీరియస్‌ను పెంచాయి. నువ్వా, నేనా అంటూ ఇద్దరి సంభాషణ సాగింది.

మార్క్ వా-దినేశ్ కార్తిక్
మార్క్ వా-దినేశ్ కార్తిక్ (Getty Images)

Mark Waugh vs Dinesh Karthik: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించి సిరీస్‌ను 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కామేంటర్లుగా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీ ప్లేయర్ మార్క్ వా, భారత సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ మధ్య సరదాగా మొదలైన మాటలు ఇద్దరి మధ్య సీరియస్‌నెస్‌ను పెంచాయి. ఫీల్డ్ గురించి మాట్లాడిన మార్క్ వా.. దినేశ్ కార్తిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరద వ్యాఖ్యానం కాస్త.. ఎగతాళిగా ఆపై కోపాన్ని తెప్పించాయి.

ట్రెండింగ్ వార్తలు

"ముందుగా మార్క్‌వా మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే ఈ ఫీల్డ్ చూసి ఆశ్చర్యపోయాను. మీకు సిల్లీ మిడ్ ఆఫ్ ఉండదంటే నమ్మలేకపోతున్నాను. వందకు అటు ఇటుగా ఉన్న పరుగుల కోసం బ్యాటర్లు కష్టపడుతున్నారు. పరుగుల కోసం కష్టపడుతున్న పుజారను మీరు చూడవచ్చు. అతడు ఆఫ్ సైడ్ బాల్‌ను దూరంగా ప్యాడ్ చేశాడు." అంటూ మార్క్‌వా స్పందించారు. అనంతరం ఇద్దరి మధ్య సరాదాగా సంభాషణ ప్రారంభమైంది.

కార్తిక్: మీరు ఫీల్డ్ గురించి ఆనందంగా లేరని నాకర్థమైంది. కానీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు?

మార్క్ వా: నాకు ఆఫ్ సైడ్ బ్యాట్ ప్యాడ్ కావాలి. అక్కడ కవర్ ఉంటుంది. అప్పుడే ఆ ఫీల్డ్ సహేతుకంగా ఉంటుంది.

కార్తిక్: మీకు ఆ పాయింట్ ఉండుంటే బహుశా ఆ బంతి బౌండరీకి వెళ్లి ఉండేది.

మార్క్ వా: మీరు చెప్పినట్లుగా అయితే అది నేరుగా సర్కిల్‌లో ఫీల్డర్ వద్దకు వెళ్లేది.

కార్తిక్: ఆ గ్యాప్ అతడు కనుగొనలేడని మీకు అనిపించిందా? ఎందుకంటే అతడికి ఆ టైమ్ ఉంది

మార్క్ వా: మేము ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తాం. కానీ నేను పుజారాతో ఆడుతున్నట్లయితే నాకు బ్యాట్ ప్యాడ్ ఆఫ్ సైడ్ కావాలి.

కార్తిక్: అయితే అక్కడ రోహిత్ శర్మ లేడు. ఆ విషయం గురించి మాట్లాడరా?

మార్క్ వా: మేము రోహిత్ శర్మ గురించి మాట్లాడలేదు. అతడు పూర్తిగా భిన్నమైన ఆటగాడు.

కార్తిక్: మీ మాటలను చూస్తుంటే ఫీల్డ్‌తో సంతోషంగా ఉన్నట్లే అనిపిస్తోంది? ఏం కాదా? అక్కడ రోహిత్ శర్మ కోసం ఎవరు లేరు. ఆ విషయం మీకు తెలుస్తుందా?

మార్క్ వా: ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ అని నాకు తెలియదు.

కార్తిక్: ఇది కొంచెం పరిహాసం, వెటకారంగా అనిపిస్తోంది.

మార్క్ వా: నేను ఈ ప్రశ్నలను ఒక్కో సెషన్‌కు పరిమితం చేయబోతున్నాం. మీకు ఇంకో ప్రశ్నకు అవకాశముంది. అంతకుమించి లేదు. అని మార్క్ వా స్పందించారు. వీరి మధ్య మాటలు సీరియస్ కాకముంది తోటి కామేంటర్ సంజయ్ మంజ్రేకర్ జోక్యం చేసుకున్నారు. సరే నేను మధ్యలోకి వస్తున్నాను. స్కోర్‌ను చదవబోతున్నాను. అని మధ్యలో ఎంట్రీ ఇచ్చారు.

రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులతో మెరుగైన స్కోరు సాధించిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ను 262 పరుగులకు కట్టడి చేయడమే కాకుండా.. రెండో ఇన్నింగ్స్‌ను 61/1తో శుభారంభం చేసింది. మూడో రోజు భారత స్పిన్నర్లు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడమే కాకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకున్నారు. రవీంద్ర జడేజా 7 వికెట్లతో అదిరిపోయే ప్రదర్శన చేసి భారత్‌ను 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిపారు. మూడో టెస్టు అహ్మదబాద్ వేదికగా మార్చి 1 నుంచి మొదలు కానుంది.

WhatsApp channel