Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‍కు కొత్త కోచ్.. ఫ్లవర్‌కు గుడ్‍బై
Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కోచ్ హెడ్‍కోచ్ వచ్చాడు. జస్టిన్ లాంగర్‌ను టీమ్‍కు కోచ్‍గా ప్రకటించింది ఎల్‍ఎస్‍జీ.
Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియమ్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కొత్త హెడ్ కోచ్‍ను నియమించుకుంది. ఆండీ ఫ్లవర్‌ను ఆ స్థానం నుంచి తప్పించింది లక్నో. ఆ స్థానంలో టీమ్ హెడ్‍కోచ్‍గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌ను నియమించింది. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ నేడు (జూలై 14) అధికారికంగా ప్రకటించింది. జస్టిన్ లాంగర్‌కు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసింది. వివరాలివే..
“ఆస్ట్రేలియా టీమ్ మాజీ కోచ్, మాజీ బ్యాట్స్‌మన్ జస్టిన్ లాంగర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ హెడ్‍కోచ్‍గా నియమించుకుంది. ఆండీ ఫ్లవర్ రెండు సంవత్సరాల కాంట్రాక్టు ముగిసింది. అతడి భాగస్వామ్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం” ఎల్‍ఎస్‍జీ పేర్కొంది.
ఆస్ట్రేలియా తరఫున జస్టిన్ లాంగర్ 1993 నుంచి 2007 వరకు ఆడాడు. టెస్టుల్లో ఆసీస్‍కు ఓపెనింగ్ చేశాడు. ఆ తర్వాత 2018లో ఆస్ట్రేలియా టీమ్‍కు హెడ్‍కోచ్‍గా లాంగర్ నియమితుడయ్యాడు. అతడు కోచ్‍గా ఉన్నప్పుడే 2021 యాషెస్ సిరీస్‍ను ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలిచింది. 2021 టీ20 ప్రపంచకప్‍ను ఆసీస్ గెలిచింది. బిగ్‍బ్యాష్ లీగ్‍లో పెర్త్ స్కాచర్స్ జట్టుకు కూడా కోచ్‍గా చేశాడు లాంగర్. అతడి మార్గదర్శకత్వంలో మూడుసార్లు బిగ్‍బాష్ టైటిల్‍ను గెలిచింది పెర్త్.
కాగా, కోచ్‍గా కొనసాగాలన్న ఆస్ట్రేలియా అభ్యర్థనను లాంగర్ గతేడాది తిరస్కరించాడు. కోచ్‍గా ఉన్న సమయంలో ఆటగాళ్లు తనకు పూర్తి మద్దతుగా నిలువలేదని ఇటీవల చెప్పాడు. కాగా, ఇప్పుడు ఐపీఎల్‍లో ఎల్‍ఎస్‍జీకి కోచ్‍గా నియమితుడయ్యాడు లాంగర్.
ఎల్‍ఎస్‍జీకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్నాడు. 2022 ఐపీఎల్‍తో లక్నో జట్టు ఎంట్రీ ఇచ్చింది. 2022తో పాటు ఈ ఏడాది కూడా ఎల్‍ఎస్‍జీ ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే, టైటిల్ సాధించలేకపోయింది. 2022లో కేఎల్ రాహుల్ నేతృత్యంలో లక్నో జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‍లో ఓడిపోయింది. రాహుల్ గాయపడటంతో 2023 ఐపీఎల్ సీజన్‍లో లక్నో జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్సీ చేశాడు. ఈ ఏడాది సైతం ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్ జట్టు చేతిలో ఓడింది ఎల్‍ఎస్‍జీ.