asia mixed team badminton: 5 కి 5 విజయాలు.. భారత బ్యాడ్మింటన్ జట్టు గ్రాండ్ బోణీ.. చెలరేగిన లక్ష్యసేన్, మాళవిక
asia mixed team badminton: ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో గోల్డ్ పై గురిపెట్టిన భారత్ గ్రాండ్ గా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో మకావును చిత్తుచిత్తుగా ఓడించింది. లక్ష్యసేన్, మాళవిక రాణించారు.

ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో లక్ష్యసేన్ జోరు
ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ గ్రాండ్ గా బోణీ కొట్టింది. చైనా లో జరుగుతున్న ఈ టోర్నీలో శుభారంభం చేసింది. గోల్డ్ దిశగా తొలి అడుగు ఘనంగా వేసింది. బుధవారం (ఫిబ్రవరి 12) గ్రూప్-డి మ్యాచ్ లో భారత్ 5-0 తేడాతో మకావును చిత్తుచిత్తుగా ఓడించింది. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించింది.
- ఫస్ట్ మిక్స్ డ్ డబుల్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ తరపున సతీష్ కుమార్-ఆద్య జోడీ బరిలో దిగింది. సతీష్-ఆద్య జంట 21-10, 21-9 తేడాతో చాంగ్ లియాంగ్-వెంగ్ చి జోడీపై గెలిచింది. చెలరేగిన భారత పెయిర్ కేవలం 31 నిమిషాల్లోనే వరుస గేమ్ ల్లో ప్రత్యర్థిని ఓడించింది.
- పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ విరుచుకుపడ్డాడు. ఈ యువ షట్లర్ 21-16, 21-12తో పాంగ్ ఫాంగ్ పై విజయం సాధించాడు. డ్రాప్ లు, స్మాష్ లతో లక్ష్య ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు.
- మహిళల సింగిల్స్ మ్యాచ్ లో ఎన్నో అంచనాలతో బరిలో దిగిన యువ తార మాళవిక బన్సోద్ కూడా బెటర్ ఫర్ ఫార్మెన్స్ చేసింది. ఆమె 21-15, 21-9తో వాయ్ చన్ పై గెలిచింది. స్టార్ షట్లర్ పీవీ సింధు లేకపోవడంతో మహిళల సింగిల్స్ లో ఆశలన్నీ మాళవికపైనే ఉన్నాయి.
- పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ జోడీ కాకుండా.. అర్జున్-చిరాగ్ జంట బరిలో దిగింది. ఈ భారత ద్వయం 21-15, 21-9తో చోన్-వెంగ్ పెయిర్ పై విక్టరీని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ నుంచి తెలుగు స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తప్పుకొన్నాడు.
- మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కూడా సత్తాచాటింది. ట్రీసాతో కలిసి తెలుగు ప్లేయర్ గాయత్రి మంచి ప్రదర్శన చేసింది. గాయత్రి-ట్రీసా 21-10, 21-5తో వెంగ్ చి-చి వా జోడీపై విజయం సాధించింది.
సంబంధిత కథనం