Olympics India schedule today: నేడు లక్ష్యసేన్ పతక పోరు.. షూటింగ్, టీటీ టీమ్ ఈవెంట్స్.. భారత్ నేటి షెడ్యూల్ ఇదే
Paris Olympics 2024 day 10 India’s schedule Today: పారిస్ ఒలింపిక్ క్రీడల్లో నేడు భారత్‍కు ఓ మెడల్ మ్యాచ్ ఉంది. అలాగే మరిన్ని పోటీల్లో అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. నేడు (ఆగస్టు 5) ఒలింపిక్స్‌లో భారత్ షెడ్యూల్‍ను ఇక్కడ చూడండి.
పారిక్ ఒలింపిక్స్ 2024 రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ మూడు కాంస్య పతకాలు సాధించింది. క్రీడల 10వ రోజైన నేడు (ఆగస్టు 5) ఇండియా మరో పతకం సాధించేందుకు అవకాశం ఉంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‍లో ఓటమి పాలైన భారత యంగ్ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ నేడు కాంస్య పతక పోరులో బరిలోకి దిగనున్నాడు. ఈ ప్లేఆఫ్ మ్యాచ్ గెలిస్తే అతడికి కాంస్యం దక్కుతుంది. మలేషియా ప్లేయర్ లీ జీ జియాతో లక్ష్య తలపడనున్నాడు.
టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‍లో తెలుగు ప్లేయర్ ఆకుల శ్రీజ, మనికా బాత్రా, ఆర్చనా కామత్ మ్యాచ్ కూడా ఉంది. షూటింగ్, సెయిలింగ్ సహా మరిన్ని పోటీల్లో భారత అథ్లెట్లు నేడు (ఆగస్టు 5) బరిలోకి దిగనున్నారు. ఆ షెడ్యూల్ ఇక్కడ చూడండి.
షూటింగ్
షూటింగ్ స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్: మహేశ్వరి చౌహాన్, అనంత్ జీత్ సింగ్ - మధ్యాహ్నం 12.30 గంటలకు.. (క్వాలిఫై అయితే ఫైనల్ కూడా నేడే)
టేబుల్ టెన్నిస్
భారత మహిళల జట్టు టేబుల్ టెన్నిస్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్: భారత్ (శ్రీజ, మనికా, ఆర్చనా కామత్) vs రొమేనియా - మధ్యాహ్నం 1.30 గంటల నుంచి..
సెయిలింగ్
మహిళల డింగీ (ఓపెనింగ్ సిరీస్): రేస్ 9 - మధ్యాహ్నం 3.45 గంటలకు..
మహిళల డింగీ (ఓపెనింగ్ సిరీస్): రేస్ 10 - సాయంత్రం 4.53 గంటలకు..
పురుషుల డింగీ (ఓపెనింగ్ సిరీస్): రేస్ 9 - సాయంత్రం 6.10 గంటలకు..
పురుషుల డింగీ (ఓపెనింగ్ సిరీస్): రేస్ 10 - రాత్రి 7.20 గంటలకు..
అథ్లెటిక్స్
మహిళల 400 మీటర్ల పరుగు (రౌండ్ 1): కిరణ్ పహాల్ (హీట్ 5) - మధ్యాహ్నం 3.25 గంటలకు..
పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్‍చేజ్ (రౌండ్ 1): అవినాష్ సాబ్లే (హీట్ 2) - రాత్రి 10.34 గంటలకు..
బ్యాడ్మింటన్
పురుషుల సింగిల్స్ కాంస్య పతకం కోసం ప్లేఆఫ్: భారత ప్లేయర్ లక్ష్యసేన్ vs మలేషియా ఆటగాడు లీ జీ జియా మధ్య.. సాయంత్రం 6.00 గంటలకు..
లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్
పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడా పోటీలను ఇండియాలో స్పోర్ట్ 18 నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది.
భారత హాకీ సెమీస్ పోరు రేపు.. జర్మనీతో..
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆదివారం (ఆగస్టు 4) జరిగిన క్వార్టర్ ఫైనల్‍లో గ్రేట్ బ్రిటన్‍పై టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ 1-1తో సమమైనా షూటౌట్‍లో 4-2 తేడాతో భారత్ గెలిచింది. అమిత్ రోహిదాస్‍కు రెడ్ కార్డ్ రావటంతో చివరి 43 నిమిషాలు 10 మంది ప్లేయర్లతోనే ఆడినా టీమిండియా దుమ్మురేపింది. షౌటౌట్‍లో గ్రేట్ బ్రిటన్‍ను భారత గోల్ కీపర్ శ్రీజేశ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. షూటౌట్‍లో భారత ప్లేయర్లు వరుసగా నాలుగుసార్లు స్కోర్స్ చేశారు. దీంతో టీమిండియా విజయం సాధించింది. రేపు (ఆగస్టు 6) జరిగే సెమీఫైనల్‍లో జర్మనీతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే పతకం పక్కా అవుతుంది.