Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్!
Koneru Humpy Fide Women's World Rapid Chess Champion Title 2024: 2024 ఫిడే ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగు తేజం కోనేరు హంపి కైవసం చేసుకుంది. దీంతో చైనా జు వెన్‌జున్ తర్వాత మహిళల విభాగంలో పలు సందర్భాల్లో విజయం సాధించిన రెండో చెస్ ప్లేయర్‌గా కోనేరు హంపి నిలిచింది.
Koneru Humpy Fide Women's World Rapid Chess Champion Title 2024: మొన్న వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేష్ నిలిచి భారత్‌ను సగౌర్వ పడేలా చేశాడు. ఇప్పుడు తెలుగు తేజం కోనేరు హంపి మరోసారి భారతదేశానికి గౌరవం తీసుకొచ్చింది.
రెండో చెస్ ప్లేయర్‌గా
గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 2024 ఫిడే ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ విజేతగా నిలిచింది. ఆదివారం (డిసెంబర్ 29) న్యూయార్క్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. చైనాకు చెందిన జు వెన్‌జున్ తర్వాత మహిళల విభాగంలో పలు సందర్భాల్లో విజయం సాధించిన రెండో చెస్ ప్లేయర్‌గా నిలిచింది 37 ఏళ్ల కోనేరు హంపి.
మాస్కో విజయం తర్వాత
చివరి రౌండ్‌లో ఐరీన్ సుకందర్‌ను బ్లాక్‌పీస్‌తో ఓడించి హంపీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇది ఆమె గెలుపుకు చాలా కీలకంగా మారింది. ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో కోనేరు హంపి 11కు 8.5 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ఫార్మాట్‌లో 2019లో మాస్కోలో విజయం సాధించిన తర్వాత కోనేరు హంపి రెండోసారి టైటిల్‌ను సాధించింది.
అతి పిన్న వయస్కుడిగా
ఆంటే, ఫిడే ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్ విజేతగా కోనేరు హింపి నిలవడం ఇది రెండోసారి. ఇక పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలోడర్ ముర్జిన్ టైటిల్ గెలుచుకున్నాడు. అతను 17 సంవత్సరాల వయస్సులో ఛాంపియన్‌గా నిలిచిన నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్ తర్వాత రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
రెండో భారతీయుడుగా గుకేష్
ఇదిలా ఉంటే, డింగ్ లిరెన్‌ను ఓడించి డి గుకేష్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వారాల తర్వాత హంపి టైటిల్ విజయం సాధించింది భారత ప్రతిష్టతను మరింత పెంచింది. దీంతో చెస్‌లో భారత్‌కు అసాధారణమైన సంవత్సరంగా భావిస్తున్నారు. అలాగే, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీని గెలుచుకున్న రెండో భారతీయుడిగా గుకేష్ నిలిచాడు.
2023లో రజతం
ఇక 2012 ఎడిషన్ టోర్నమెంట్‌లో మాస్కోలో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా హంపి తన సత్తా చాటింది. అయితే, 2019లో జార్జియాలోని బటుమీలో చైనాకు చెందిన లీ టింగ్‌జీని ఓడించి టైటిల్‌ను గెలుచుకోవడంలో ఆమె సంచలన గేమ్ ప్లేను ప్రదర్శించింది. భారత గ్రాండ్‌మాస్టర్ 2023 ఎడిషన్‌లో హంపి రజత పతకాన్ని గెలుచుకుంది.
రెండో స్థానంలో
ర్యాపిడ్ చెస్‌లో ఆమె సాధించిన విజయాలతో పాటు, హంపీ ఇతర ఫార్మాట్‌లలో కూడా ఆకట్టుకుంది. ఆమె 2022 మహిళల ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అళాగే, 2024లో మహిళల అభ్యర్థుల టోర్నమెంట్‌లో రెండవ స్థానంలో నిలిచింది.
టాపిక్