Kohli gifts jersey: ఖవాజా, కేరీలకు జెర్సీలు గిఫ్ట్‌గా ఇచ్చిన విరాట్ కోహ్లి.. వీడియో-kohli gifts jerseys to australia players khawaja and carey ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Gifts Jersey: ఖవాజా, కేరీలకు జెర్సీలు గిఫ్ట్‌గా ఇచ్చిన విరాట్ కోహ్లి.. వీడియో

Kohli gifts jersey: ఖవాజా, కేరీలకు జెర్సీలు గిఫ్ట్‌గా ఇచ్చిన విరాట్ కోహ్లి.. వీడియో

Hari Prasad S HT Telugu
Mar 13, 2023 08:19 PM IST

Kohli gifts jersey: ఖవాజా, కేరీలకు జెర్సీలు గిఫ్ట్‌గా ఇచ్చాడు విరాట్ కోహ్లి. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన తర్వాత విరాట్.. ఆస్ట్రేలియా ప్లేయర్స్ దగ్గరికి వెళ్లి మరీ వాటిని ఇవ్వడం విశేషం.

నాలుగో టెస్టు ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్స్ తో విరాట్ కోహ్లి ముచ్చట్లు
నాలుగో టెస్టు ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్స్ తో విరాట్ కోహ్లి ముచ్చట్లు (ANI)

Kohli gifts jersey: టెస్ట్ క్రికెట్ లో 1205 రోజుల తర్వాత విరాట్ కోహ్లి సెంచరీ చేసిన సంగతి తెలుసు కదా. అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ 186 పరుగులు చేశాడు. జ్వరంతో బాధపడుతూ కూడా అతడు ఈ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా సొంతమైంది.

అయితే ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా గెలిచిన ఏకైక టెస్ట్ తోపాటు చివరి మ్యాచ్ లోనూ ఆ టీమ్ పటిష్టంగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు మ్యాచ్ తర్వాత తాను సంతకం చేసిన తన జెర్సీని గిఫ్ట్ గా ఇచ్చాడు విరాట్ కోహ్లి. అతనితోపాటు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి కూడా మరో జెర్సీ ఇచ్చాడు. మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ కు ముందు కోహ్లి ఈ జెర్సీలు ఇస్తున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.

ఈ టెస్టులో విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. చాలా రోజుల తర్వాత సెంచరీ చేసిన ఖుషీలో కనిపించిన విరాట్.. అదే జోష్ లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ తో మాట్లాడుతూ కనిపించాడు. అంతకుముందు రెండో టెస్ట్ సందర్భంగా ఇండియా బ్యాటర్ చెతేశ్వర్ పుజారాకు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్స్ తాము సంతకాలు చేసిన కిట్ అందించారు.

ఢిల్లీలో జరిగిన ఆ మ్యాచ్ పుజారా కెరీర్ లో వందో టెస్ట్ కావడంతో ఇలా గిఫ్ట్ ఇచ్చారు. 2020-21 టూర్ లో అప్పుడు స్టాండిన్ కెప్టెన్ గా ఉన్న అజింక్య రహానే, టీమ్ వందో టెస్ట్ ఆడిన ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లయన్ కు కూడా ఇలాంటి బహుమతిని ఇవ్వడం విశేషం. మూడో టెస్టులో ఓడి నాలుగో టెస్టులో ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్.. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సమర్పించుకుంది.

అయితే విరాట్ కోహ్లితోపాటు శుభ్‌మన్ గిల్ సెంచరీలు చేయడంతో తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సంపాదించిన ఇండియన్ టీమ్.. చివరికి ఆస్ట్రేలియానే ఒత్తిడిలోకి నెట్టింది. అయితే అహ్మదాబాద్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగు టెస్టుల సిరీస్ ను ఇండియా 2-1తో గెలిచింది. 2017 నుంచి వరుసగా నాలుగోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

సంబంధిత కథనం