Kaviya Maran marriage proposal: నన్ను పెళ్లి చేసుకుంటావా కావ్య.. ఐపీఎల్ మిస్టరీ గాళ్‌కి సౌతాఫ్రికా నుంచి ప్రపోజల్
Kaviya Maran marriage proposal: నన్ను పెళ్లి చేసుకుంటావా కావ్య అంటూ ఐపీఎల్ మిస్టరీ గాళ్‌కి సౌతాఫ్రికా నుంచి ప్రపోజల్ పంపించాడు ఓ అభిమాని. సౌతాఫ్రికా టీ20 లీగ్ అయిన SA20లో సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ప్రపోజల్ రావడం విశేషం.
Kaviya Maran marriage proposal: ఐపీఎల్లో మిస్టరీ గాళ్‌గా వార్తల్లో నిలిచింది సన్ నెట్‌వర్క్ ఓనర్ కళానిధి మారన్ కూతురు కావ్యా మారన్. ఈ మెగా లీగ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లు చూడటానికి స్టేడియానికి రావడంతో ఆమె కెమెరాలకు చిక్కింది. మొదట్లో ఎవరీ మిస్టరీ గాళ్ అంటూ ఫ్యాన్స్ నెట్ లో తెగ వెతికేశారు. ఆ తర్వాత ఆమె ఐపీఎల్ వేలంలో రెగ్యులర్ గా సన్‌రైజర్స్ టేబుల్ దగ్గర కనిపించింది.
కావ్య.. ఆ టీమ్ ఓనర్ కూతురే అని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి సౌతాఫ్రికా నుంచి ఆమెకు ఓ పెళ్లి ప్రతిపాదన వచ్చింది మరి. ప్రస్తుతం ఆ దేశంలో వాళ్ల సొంత లీగ్ ఎస్ఏ20 (SA20) నడుస్తున్న సంగతి తెలుసు కదా. అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకే చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ కూడా ఉంది.
ఈ టీమ్ హ్యాట్రిక్ విజయాలతో ప్రస్తుతం టేబుల్లో రెండోస్థానంలో ఉంది. ఆ టీమ్ పార్ల్ రాయల్స్ తో గురువారం (జనవరి 19) తలపడింది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ సౌతాఫ్రికా క్రికెట్ అభిమాని.. ఓ ప్లకార్డు పట్టుకొని కనిపించాడు. దానిపై "కావ్యా మారన్.. నన్ను పెళ్లి చేసుకుంటావా" అని ఉండట విశేషం. మ్యాచ్ కవర్ చేస్తున్న కెమెరామ్యాన్ ఒకరికి ఇది చాలా ఆసక్తిగా అనిపించి కెమెరాను కాసేపు ఆ అభిమాని వైపు జూమ్ చేశాడు.
పార్ల్ రాయల్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ ముగిసిన తర్వాత ఈ అభిమాని కనిపించాడు. ఈ వీడియో చూసిన తర్వాత కావ్య మారన్ క్రేజ్ సౌతాఫ్రికాకు కూడా పాకిందా అని అభిమానులు అనుకుంటున్నారు. కళ్లు చెదిరే అందంతో కావ్య ఐపీఎల్ సందర్భంగా కూడా ఎంతోమంది అభిమానులను ఆకర్షించింది. ఆమె ఎవరో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపించారు.
మరోవైపు ఎస్ఏ20లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ హ్యాట్రిక్ విజయాలతో రెండోస్థానానికి దూసుకెళ్లింది. పార్ల్ రాయల్స్ పై సన్ రైజర్స్ టీమ్ ఐదు వికెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్ లోనూ మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్ రాణించారు. అంతకుముందు మ్యాచ్ లోనూ జాన్సెస్ చెలరేగిన విషయం తెలిసిందే. అతని దూకుడుతో ఎంఐ కేప్ టౌన్ టీమ్ ను సన్ రైజర్స్ చిత్తు చేసింది. ఆ మ్యాచ్ లో రషీద్ ఖాన్ వేసిన ఒక ఓవర్లో జాన్సెన్ ఏకంగా 28 రన్స్ బాదాడు.
సంబంధిత కథనం
టాపిక్