Joe Root: ఒక్క సెంచరీతో గవాస్కర్‌, పాంటింగ్‌, విరాట్‌ కోహ్లిలను మించిపోయిన రూట్‌-joe root surpasses gavaskar ricky ponting and virat kohli with century against india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Joe Root Surpasses Gavaskar Ricky Ponting And Virat Kohli With Century Against India

Joe Root: ఒక్క సెంచరీతో గవాస్కర్‌, పాంటింగ్‌, విరాట్‌ కోహ్లిలను మించిపోయిన రూట్‌

Hari Prasad S HT Telugu
Jul 05, 2022 05:28 PM IST

Joe Root: తన లైఫ్‌టైమ్‌ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌.. చివరి టెస్ట్‌లో సెంచరీతో గవాస్కర్‌, పాంటింగ్‌, విరాట్‌ కోహ్లిలాంటి క్రికెటర్లను మించిపోయాడు.

ఏడాదిన్నర కాలంగా తిరుగులేని ఫామ్ లో ఉన్న జో రూట్
ఏడాదిన్నర కాలంగా తిరుగులేని ఫామ్ లో ఉన్న జో రూట్ (AP)

బర్మింగ్‌హామ్‌: అతని మాటలు తక్కువ.. ఆట ఎక్కువ. ఎలాంటి ఎమోషన్స్‌ ఉండవు. కామ్‌గా వస్తాడు.. తన పని పక్కాగా చేసుకొని వెళ్తాడు. ఈ మధ్య క్రీజులోకి అడుగుపెడితే చాలు కనీసం హాఫ్ సెంచరీయో, సెంచరీయో చేయకుండా వెనుదిరగడం లేదు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌. గతేడాది యాషెస్‌ సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. బ్యాట్‌తో మాత్రం ఇంగ్లండ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా ఇండియాపై సాధించిన చారిత్రక విజయంలోనూ రూట్‌దే కీ రోల్‌. రెండో ఇన్నింగ్స్‌లో ఎంతో ఒత్తిడిలోనూ సెంచరీ చేసి టెస్ట్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు తన అత్యధిక చేజింగ్‌ రికార్డు సాధించి పెట్టాడు. ఈ సెంచరీతో అతడు లెజెండరీ క్రికెటర్లు సునీల్‌ గవాస్కర్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌తోపాటు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలను కూడా వెనక్కి నెట్టాడు.

ఈ కేలండర్‌ ఇయర్‌లో రూట్‌కు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో ఇండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సునీల్‌ గవాస్కర్‌ను మించిపోయాడు. 2012 నుంచి ఇండియాతో 25 టెస్టులు ఆడిన రూట్‌.. 62.72 సగటుతో 2509 రన్స్‌ చేశాడు. మరోవైపు గవాస్కర్‌ 38 టెస్టుల్లో ఇంగ్లండ్‌పై 2483 రన్స్ చేశాడు.

ఈ లిస్ట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ 2535 రన్స్‌తో టాప్‌లో ఉన్నాడు. అతని తర్వాతి స్థానం రూట్‌దే. ఇక ఇండియాపై అతనికిది 9వ సెంచరీ. ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఇన్నాళ్లూ రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును రూట్‌ అధిగమించాడు. పాంటింగ్‌ ఇండియాపై 29 టెస్టులు ఆడి 8 సెంచరీలు చేశాడు. ఇక ఇండియాపై అత్యధిక రన్స్‌ చేసిన వాళ్లలో రూట్‌ రెండోస్థానంలో ఉన్నాడు.

రికీ పాంటింగ్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో ఇండియాపై 2555 రన్స్‌ చేశాడు. ఇక చివరిగా టెస్ట్‌ కెరీర్‌లో రూట్‌కిది 28వ సెంచరీ. దీంతో ఫాబ్‌ ఫోర్‌లో విరాట్‌ కోహ్లి, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌లతోపాటు నిలిచిన జో రూట్‌.. వాళ్లందరినీ మించిపోయాడు. కోమ్లి, స్మిత్‌ టెస్టుల్లో చెరో 27 సెంచరీలు చేశారు. ఇప్పుడా ఇద్దరినీ రూట్‌ దాటి వెళ్లాడు. ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వాళ్లలో రూట్‌వే అత్యధిక సెంచరీలు కాగా.. ఓవరాల్‌గా ఈ లిస్ట్‌లో 15వ స్థానంలో ఉన్నాడు.

WhatsApp channel