Jaydev Undakat return to Test Squad: లాంగ్ గ్యాప్ తర్వాత ఉనాద్కట్ రీఎంట్రీ.. అదే జరిగితే అతడి ఖాతాలో అరుదైన రికార్డు
Jaydev Undakat return to Test Squad: టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశముంది. బంగ్లాతో టెస్టు సిరీస్‌లో అతడు తుది జట్టులో ఎంపికైతే.. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు ఆడిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.
Jaydev Undakat return to Test Squad: భారత లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో ఆడబోతున్నాడు. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత అతడు వైట్ జెర్సీని ధరించబోతున్నాడు. టీమిండియా రెగ్యూలర్ పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు దూరం కావడంతో.. అతడి స్థానంలో ఉనాద్కట్ చోటు దక్కించుకున్నాడు. దేశవాళీ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న అతడిని సెలక్షన్ కమిటీ.. బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేసింది. ఉనాద్కట్ చివరగా 2010లో సౌతాఫ్రికా తరఫున ఆడాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు ప్రయాణమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉన్న జయదేవ్ ఉనాద్కట్.. బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు వీసా ఫార్మాల్టీలను పూర్తి చేసే పనిలో ఉన్నాడని సమాచారం. డిసెంబరు 14 నుంచి బంగ్లాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం అతడు వెళ్లనున్నాడు. రెండు టెస్టుల మధ్య అత్యధిక కాలం పాటు విరామం తీసుకున్న ఆటగాడిగా పార్థివ్ పటేల్ పేరిట రికార్డు ఉంది. అతడు 8 ఏళ్ల పాటు అతడు టెస్టుల్లో పునరాగమనం కోసం ఎదురుచూశాడు. తాజాగా ఆ రికార్డును ఉనాద్కట్ బద్దలు కొట్టే అవకాశముంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అతడు తుది జట్టులో చోటు దక్కించుకుంటే ఆ రికార్డును బ్రేక్ చేస్తాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్న ఉనాద్కట్.. జాతీయ జట్టులో స్థానం కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాడు. 2019-20 రంజీ ట్రోఫీలో అతడు 67 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 96 ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 353 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
మొదట మహమ్మద్ షమీ.. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. భుజం గాయం కారణంగా ఆ పర్యటనకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఉనాద్కట్‌ను తీసుకున్నారు. అయితే ఇండియా ఏ జట్టు పేసర్లు నవదీప్ సైనీ, ముకేష్ కుమార్‌ను ఈ సిరీస్‌కు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇటీవల బంగ్లాదేశ్ ఏ సిరీస్‌తో జరిగిన రెండు అనధికార టెస్టుల్లో వారు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. అయితే అనుభవజ్ఞుడైన ఉనాద్కట్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.
సంబంధిత కథనం