Javed Miandad on India: ఆసియా కప్ కోసం ఇండియన్ టీమ్ పాకిస్థాన్ కు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లబోదని, అవసరమైతే టోర్నీనే మరో చోటికి తరలిస్తామని బీసీసీఐ తేల్చి చెప్పిన విషయం తెలుసు కదా. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ టీమ్ తమ దగ్గరికి వస్తే ఎంత రాకపోతే ఎంత అంటూ తేలిగ్గా తీసి పారేశాడు.,"పాకిస్థాన్ లో క్రికెట్ ఆడటానికి ఇండియా వస్తే రాని లేకపోతే లేదు. నేనెప్పుడూ పాకిస్థాన్ తరఫునే మాట్లాడతాను. ఇండియా విషయం ఎప్పుడూ వచ్చినా కఠినంగానే ఉంటాను. మనకు రావాల్సిన దాని కోసం మనం ఫైట్ చేయాల్సిందే. మేము క్రికెట్ కు ఆతిథ్యం ఇస్తాం. అది ఐసీసీ పని.,ఒకవేళ ఐసీసీ దీనిని నియంత్రించలేకపోతే అసలు అది ఉండటమే దండగ. వాళ్లు అన్ని జట్లకూ ఒకే నిబంధన విధించాలి. ఇలాంటి టీమ్స్ రాకపోతే వాటిని నిషేధించాలి. ఇండియా అయితే వాళ్లకు. మాకు కాదు" అని జావెద్ అన్నాడు.,పాకిస్థాన్ కు వచ్చి ఓడిపోతామన్న భయం వల్లే ఇండియన్ టీమ్ ఎప్పుడూ ఇక్కడికి రాదని కూడా అతడు అనడం గమనార్హం. "రండి, వచ్చి ఆడండి. ఎందుకు రారు? వాళ్లు పారిపోతారు. ఇక్కడికి వచ్చి ఓడిపోతే వాళ్లకు పెద్ద సమస్య అవుతుంది. అక్కడి అభిమానులు దీనిని జీర్ణించుకోలేరు.,ఎప్పుడూ ఇంతే. మేము ఆడే కాలంలోనూ ఇదే కారణం వల్ల వాళ్లు ఇక్కడ ఆడేవాళ్లు కాదు. అక్కడ గొడవలు అవుతాయి. అభిమానులు దారుణంగా ప్రవర్తిస్తారు. ఇండియా ఓడిపోయినప్పుడల్లా అక్కడి ఫ్యాన్స్ ఇళ్లను తగలబెడతారు. మేము ఆడే సమయంలో వాళ్లు ఇలాంటివి చూశారు" అని మియాందాద్ అన్నాడు.,"వాళ్లు ఓడిపోయేవాళ్లు. దీనిని అక్కడి అభిమానులు అర్థం చేసుకోవాలి. క్రికెట్ ఓ ఆట. బాగా ఆడకపోతే ఓడిపోతారు. బాగా ఆడితే గెలుస్తారు. కానీ ఇలా చేయడమేంటి?,ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే ఐసీసీ చాలా కఠినంగా ఉండాలని కోరుతున్నాను. మీది ఇండియా అయితే ఏంటి? ఏ దేశం ఇలా వ్యవహరించినా ఐసీసీ చర్యలు తీసుకోవాల్సిందే. అలాంటి జట్లపై వేటు వేస్తే ఓ గుణపాఠమవుతుంది" అని మియాందాద్ అన్నాడు.,,