Pro Kabaddi 2022 Winner: ప్రో కబడ్డీ సీజన్ 9 విజేతగా జైపూర్ పింక్ పాంథర్స్ - రెండో టైటిల్ సొంతం-jaipur pink panthers defeat puneri paltan to win pro kabaddi season 9 title ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Jaipur Pink Panthers Defeat Puneri Paltan To Win Pro Kabaddi Season 9 Title

Pro Kabaddi 2022 Winner: ప్రో కబడ్డీ సీజన్ 9 విజేతగా జైపూర్ పింక్ పాంథర్స్ - రెండో టైటిల్ సొంతం

Nelki Naresh Kumar HT Telugu
Dec 18, 2022 10:13 AM IST

ప్రో క‌బ‌డ్డీ సీజ‌న్ 9 విజేత‌గా జైపూర్ పింక్ పాంథ‌ర్స్ నిలిచింది. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో 33-29 తేడాతో పుణెరి ప‌ల్టాన్‌పై విజ‌యాన్ని సాధించి ట్రోఫీని ద‌క్కించుకున్న‌ది

జైపూర్ పింక్ పాంథ‌ర్స్
జైపూర్ పింక్ పాంథ‌ర్స్

ప్రో క‌బ‌డ్డీ సీజ‌న్ 9 విజేత‌గా జైపూర్ పింక్ పాంథ‌ర్స్ నిలిచింది. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో 33-29 తేడాతో పుణెరి ప‌ల్టాన్‌పై విజ‌యాన్ని సాధించింది. గ‌త ఐదు మ్యాచ్‌ల‌లో విజ‌యాన్ని అందుకున్న జైపూర్ ఫైన‌ల్‌లో అదే జోరును కొన‌సాగించింది. పుణెరి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైనా ఒత్తిడిని జ‌యించి జైపూర్ విజేత‌గా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

2014లో ప్రో క‌బ‌డ్డీ లీగ్ ప్రారంభ సీజ‌న్‌లో విజేత‌గా నిలిచిన జైపూర్ పింక్ పాంథ‌ర్స్ తొమ్మిదేళ్ల త‌ర్వాత ట్రోఫీని సొంతం చేసుకున్న‌ది. ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథ‌ర్స్ రైడింగ్‌, డిఫెండింగ్‌లో రాణించింది. జైపూర్ స్టార్ రైడ‌ర్ అర్జున్ దేశ్‌వాల్, అజిత్ కుమార్ త‌లో ఆరు రైడింగ్ పాయింట్ల‌తో స‌త్తాచాటారు.

డిఫెండ‌ర్ సునీల్ కుమార్ ఆరు ట్యాకిల్ పాయింట్లు సాధించి జైపూర్ విజ‌యంలో కీల‌క భూమిక పోషించాడు. స్టార్ ప్లేయ‌ర్ న‌బీబ‌క్ష్ విఫ‌లం కావ‌డం పుణెరిని దెబ్బ‌కొట్టింది. కేవ‌లం అత‌డు నాలుగు పాయింట్లు మాత్ర‌మే సాధించాడు.

ఈ సీజ‌న్‌లో బెస్ట్ డిఫెండ‌ర్‌గా జైపూర్ పింక్ పాంథ‌ర్స్ ప్లేయ‌ర్ అంకుశ్ నిలిచాడు. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయ‌ర్‌గా అర్జున్ దేశ్‌వాల్ నిలిచాడు. మొత్తం 72 రోజుల పాటు ప్రో క‌బ‌డ్డీ సీజ‌న్ 9 సాగింది. జైపూర్ పింక్ పాంథ‌ర్స్‌కు బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ ఓన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు.

WhatsApp channel

టాపిక్