Trolls on Jadeja: భార్యను సపోర్ట్ చేసినందుకు జడేజాపై ట్రోల్స్.. ఆర్ఎస్ఎస్‌ గురించి ట్వీట్ చేసిన క్రికెటర్-jadeja trolled for praising wife knowledge about rss ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Jadeja Trolled For Praising Wife Knowledge About Rss

Trolls on Jadeja: భార్యను సపోర్ట్ చేసినందుకు జడేజాపై ట్రోల్స్.. ఆర్ఎస్ఎస్‌ గురించి ట్వీట్ చేసిన క్రికెటర్

Maragani Govardhan HT Telugu
Dec 28, 2022 10:56 AM IST

Trolls on Jadeja: రవీంద్ర జడేజాపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల తన భార్య రివాబా ఆర్ఎస్ఎస్ ప్రశంసిస్తూ మాట్లాడగా.. ఆమె పరిజ్ఞానం గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు జడ్డూ. దీంతో అతడిపై కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (ANI)

Trolls on Jadeja: సోషల్ మీడియా ప్రభావంతో ఏది మాట్లాడినా, ఏం పోస్ట్ చేసినా ఆచితూచి వ్యవహరించాలి. సెలబ్రెటీలైతే ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆబాసు పాలవ్వక తప్పదు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్నాడు. నెటిజన్లు నుంచి జడేజా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. తన భార్య రివాబా జడేజా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరిజ్ఞానాన్ని ప్రశంసిస్తూ అతడు చేసిన ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఆమెకు సపోర్టుగా మాట్లాడుతూ.. ఇండియన్ అంటూ క్యాప్షన్ జోడించిన జడ్డూను కొంతమంది ట్రోలింగ్ రూపంలో తెగ విమర్శిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

గుజరాత్ ఎన్నికల్లో ఎంఎల్యేగా గెలిచిన రివాబా జడేజా.. ఇటీవల ఓ సమావేశంలో బిజేపీ, ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన తన పరిజ్ఞానాన్ని తెలుపుతూ మాట్లాడారు. ఆ వీడియోపై స్పందించిన జడేజా.. భార్యను ప్రశంసిస్తూ వీడియోను షేర్ చేశాడు.
“ఆర్ఎస్ఎస్ గురించి నీకున్న పరిజ్ఞానం బాగుంది. భారతీయ సంస్కృతి, మన సమాజ విలువలను నిలబెట్టే ఆదర్శాలను ప్రోత్సహించే సంస్థ ఆర్ఎస్ఎస్. నీ జ్ఞానం, కృషి నిన్ను వేరు చేసింది. అలాగే దాన్ని కొనసాగించు. ”అంటూ జడేజా భార్య గురించి ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా మరో ట్వీట్‌లో ఇండియన్ అంటూ జాతీయ జెండాను క్యాప్షన్‌ పెట్టాడు.

జడ్డూ ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెజిటన్లు కూడా విశేషంగా స్పందించారు. కొంతమంది అతడిని ట్రోల్ చేశారు. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు చేరారు? అంటూ జడేజాపై కామెంట్లు వర్షం కురిపించారు. అంతేకాకుండా బీసీసీఐ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు మోకరిల్లిందా? అంటూ ట్రోల్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. "ఈడీ, ఆదాయపు పన్ను భయం కారణంగా క్రీడాకారులు, నటులు, ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరూ భాజపాను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు." అంటూ విమర్శించారు.

మరోపక్క భాజపా ప్రతినిధి షెహజాద్ పునావాల జడేజాకు మద్దతు పలికారు. అతడు తన భార్యకు మద్దతు ఇవ్వడం, ప్రశించడం మాత్రమే అతడు చేసిన తప్పు అని అన్నారు. ఆర్ఎస్ఎస్‌కు సమాజం విలువలను సమర్థిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నేత టీవీ ఛానల్‌లో జడేజాపై విమర్శలు గుప్పించారని, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడం ఏమైనా నేరమా? అంటూ ప్రశ్నించారు. ప్రణభ్ ముఖర్జీ సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆర్ఎస్ఎస్‌ను ప్రశంసించారని, చాలామంది క్రికెటర్లు బహిరంగంగానే కాంగ్రెస్‌ను సపోర్ట్ చేశారని గుర్తు చేశారు. భాజపాపై కాంగ్రెస్‌కున్న ద్వేషం జడేజాపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే స్థాయికి చేరుకుందని అన్నారు. కాంగ్రెస్‌ను పొగిడితే ఫర్వాలేదు.. కానీ ఆర్ఎస్ఎస్‌ను ప్రశంసిస్తే వారిని టార్గెట్ చేస్తారా? అంటూ నిలదీశారు.

జడేజా భార్య రివాబా ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె తరఫున భర్త రవీంద్ర జడేజా భారత జెర్సీని ప్రచారం చేసినందుకు గాను విమర్శల పాలయ్యాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్