CSK vs RR: చెన్నైకి రాజస్థాన్ షాక్- రాయల్స్‌ను గెలిపించిన యశస్వి జైస్వాల్
CSK vs RR: హ్యాట్రిక్ విజయాల తర్వాత చెన్నైకి ఓటమి ఎదురైంది. గురువారం రాజస్థాన్ చేతిలో 32 పరుగుల తేడాతో ధోనీ సేన ఓటమి పాలైంది.
CSK vs RR: హ్యాట్రిక్ సక్సెస్‌లతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ షాకిచ్చింది. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నైపై 32 పరుగులు తేడాతో రాజస్థాన్ విజయాన్ని అందుకున్నది.ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్‌కు అదిరిపోయే విక్టరీని అందించాడు. 43 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 77 రన్స్‌చేశాడు జైస్వాల్.
అతడితో పాటు ధృవ్ జురేల్ 15 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 రన్స్ చేయడంతో రాజస్థాన్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్ చక్కటి ఆరంభాన్ని అందించాడు. 29 బాల్స్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 రన్స్ చేశాడు. అతడితో పాటు శివమ్ దూబే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 33 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో శివమ్ 52 రన్స్ చేశాడు.
ధాటిగా ఆడుతోన్న రుతురాజ్, శివమ్ ఔట్ కావడం చెన్నై ఓటమి పాలైంది. చివరలో రవీంద్ర జడేజా (15 బాల్స్‌లో 23 రన్స్), మెయిన్ అలీ (12 బాల్స్‌లో 23 రన్స్) మెరుపులు మెరిపించినా చెన్నైని గెలిపించలేకపోయారు. 20 ఓవర్లలో 170 పరుగుల వద్ద చెన్నై కథ ముగిసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నారు.