Virat Kohli on du Plessis: ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లియే కొనసాగుతాడా.. ఇదీ అతని రియాక్షన్
Virat Kohli on du Plessis: ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లియే కొనసాగుతాడా? ఈ ప్రశ్నకు విరాటే సమాధానమిచ్చాడు. ఈ సీజన్ లో వరుసగా మూడో మ్యాచ్ లోనూ ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లి వ్యవహరిస్తున్నాడు.
Virat Kohli on du Plessis: ఆర్సీబీ అభిమానులకు వరుస సర్‌ప్రైజ్ లు ఇస్తున్నాడు విరాట్ కోహ్లి. ఐపీఎల్ 2023 సీజన్ లో వరుసగా మూడో మ్యాచ్ లోనూ అతడే కెప్టెన్ గా ఉండటం విశేషం. బుధవారం (ఏప్రిల్ 26) కేకేఆర్ తో మ్యాచ్ లోనూ డుప్లెస్సి లేకపోవడంతో విరాట్ కెప్టెన్సీ చేపట్టాడు. అయితే టాస్ సందర్భంగా డుప్లెస్సి గురించి అడిగిన ప్రశ్నకు కోహ్లి సమాధానమిచ్చాడు.
ట్రెండింగ్ వార్తలు
పక్కటెముకల గాయంతో బాధపడుతున్న డుప్లెస్సి.. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్నాడు. కేవలం బ్యాటింగ్ చేసి తప్పుకుంటున్నాడు. అయితే ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడబోయే సమయానికి డుప్లెస్సి తిరిగి రావచ్చని టాస్ సందర్భంగా విరాట్ చెప్పాడు. టాస్ కోసం వచ్చిన విరాట్ ను చూసి చిన్నస్వామి స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు.
"ఇవాళ కూడా ఫాఫ్ ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడుతున్నాడు. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం. వచ్చే మ్యాచ్ నుంచి అతడు తిరిగి రావచ్చని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ లో అయితే గత రెండు మ్యాచ్ ల పాత్రనే డుప్లెస్సి పోషించనున్నాడు" అని కోహ్లి స్పష్టం చేశాడు.
అయితే తాను మళ్లీ కెప్టెన్ గా వస్తానని అసలు ఊహించలేదని చెప్పాడు. "ఇది అసలు ఊహించలేదు. కానీ ఇప్పుడు అలవాటైపోయింది. ప్లానింగ్ బాగుంది. అందరూ బాగా ఆడుతున్నారు. దీంతో కెప్టెన్ గా నా పని కాస్త సులువైంది" అని విరాట్ అన్నాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లి బౌలింగ్ ఎంచుకున్నాడు.
సంబంధిత కథనం