Virat Kohli 10th marks: విరాట్ కోహ్లిలాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ చదువు ఎలా సాగింది? అతనికి పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయి? పరుగుల వరద పారించి రికార్డులు తిరగరాసే విరాట్.. లెక్కల్లో అదరగొట్టి ఉంటాడా? అన్న ప్రశ్నలు ఎప్పుడైనా తలెత్తాయా? అయితే మీ ప్రశ్నలకు విరాటే సమాధానం ఇచ్చాడు.
తాజాగా తన కూ అకౌంట్ లో విరాట్ పదో తరగతి మార్కుల షీట్ ను షేర్ చేసుకున్నాడు. అయితే అందులో అతనికి మ్యాథ్స్ లో వచ్చిన మార్కులు చూసి షాక్ తినాల్సిందే. చాలా మంది స్టూడెంట్స్ లాగే లెక్కలంటే విరాట్ కు కూడా భయమే అని ఈ మార్కులు చూస్తే తెలుస్తోంది. ఇంగ్లిష్, హిందీ, సోషల్ సబ్జెక్టుల్లో ఫర్వాలేదనిపించినా.. మ్యాథ్స్, సైన్స్ లోనే కోహ్లికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి.
మ్యాథ్స్ లో 51, సైన్స్ లో 55 మార్కులతో సరిపెట్టుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోహ్లి ఎందుకోగానీ ఈ మార్కుల షీటును షేర్ చేసుకున్నాడు. అయితే తర్వాత ఏమైందో గానీ మళ్లీ డిలీట్ చేశాడు. కానీ అంతలోపే కోహ్లి పదో తరగతి మార్కులు షీటు వైరల్ అయింది. క్రికెట్ ఫీల్డ్ లో రికార్డులు తిరగరాసే విరాట్.. లెక్కల్లో మరీ ఇంత వీకా అని కొందరు కామెంట్స్ చేశారు.
గతేడాది చెత్త ఫామ్ లో ఉన్న కోహ్లి 2022 ఐపీఎల్లో విఫలమయ్యాడు. అయితే ఈసారి మళ్లీ టాప్ ఫామ్ లోకి వచ్చిన అతడు.. మరోసారి చెలరేగడానికి సిద్ధమవుతున్నాడు. అంతేకాదు 15 సీజన్లుగా ఆర్సీబీని ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీని కూడా అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. తొలి సీజన్ నుంచీ ఆ టీమ్ తరఫునే ఆడుతున్న విరాట్.. 223 మ్యాచ్ లలో 6624 రన్స్ చేసి ఐపీఎల్లోనే అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ తన తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఆర్సీబీ క్యాంప్ లో చేరిన అతడు.. బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
సంబంధిత కథనం