Dhawan Equals Kohli Record: ధావన్ అరుదైన ఘనత.. కోహ్లీ రికార్డు సమం చేసిన గబ్బర్-shikhar dhawan equals virat kohli unbelievable feat in ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shikhar Dhawan Equals Virat Kohli Unbelievable Feat In Ipl 2023

Dhawan Equals Kohli Record: ధావన్ అరుదైన ఘనత.. కోహ్లీ రికార్డు సమం చేసిన గబ్బర్

Maragani Govardhan HT Telugu
Apr 01, 2023 09:41 PM IST

Dhawan Equals Kohli Record: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 50 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు.

శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ (AFP)

Dhawan Equals Kohli Record: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ధావన్ 40 పరుగుల నిలకడైన ప్రదర్శనతో రాణించాడు. పంజాబ్ బ్యాటర్ భానుక రాజపక్స‌తో కలిసి 86 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించాడు. ఫలితంగా పంజాబ్.. కేకేఆర్ ముందు 192 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ మ్యాచ్ ధావన్ మరో అరుదైన ఘనత సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ భాగస్వామ్యాలు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ధావన్‌కు ఇది 94వ అర్ధశతక భాగస్వామ్యం. ఈ విషయంలో కోహ్లీ రికార్డును గబ్బర్ సమం చేశాడు. విరాట్ కూడా 94 అర్ధశతక భాగస్వామ్యాలను నమోదు చేశాడు.

వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మాజీ ఆటగాడు సురేష్ రైనా 83 అర్ధశతక భాగస్వామ్యాలతో మూడో స్థానంలో ఉన్నాడు. 82 భాగస్వామ్యాలతో డేవిడ్ వార్నర్.. నాలుగో స్థానంలో నిలిచాడు. కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 29 బంతుల్లో 40 పరుగులు చేశాడు.

మొహాలీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచింది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కేకేఆర్.. 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో చాలా సేపు మ్యాచ్ ఆగిపోయింది. అయితే డక్‌వర్ల్ లూయిస్ విధానం ప్రకారం కేకేఆర్.. విజయానికి మరో 7 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.

WhatsApp channel