Sehwag on Prabhsimran: ప్రభ్‌సిమ్రాన్‌ ధర 60 లక్షలు.. సామ్ కరన్ ధర 18.5 కోట్లు.. ఇద్దరినీ పోల్చిన సెహ్వాగ్-sehwag says prabhsimran for 60 lakh and he scored a ton ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sehwag Says Prabhsimran For 60 Lakh And He Scored A Ton

Sehwag on Prabhsimran: ప్రభ్‌సిమ్రాన్‌ ధర 60 లక్షలు.. సామ్ కరన్ ధర 18.5 కోట్లు.. ఇద్దరినీ పోల్చిన సెహ్వాగ్

Maragani Govardhan HT Telugu
May 14, 2023 12:52 PM IST

Sehwag on Prabhsimran: పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు అద్బుతంగా ఆడాడని, సామ్ కరన్‌తో పోలిస్తే అతడే బెటరని అన్నాడు. సామ్ కరన్‌ను రూ.18.5 కోట్లకు కొనుగోలు చేయగా.. ప్రభ్‌సిమ్రన్ ధర 60 లక్షలేనని తెలిపాడు.

ప్రభ్‌సిమ్రాన్‌పై సెహ్వాగ్ ప్రశంసల వర్షం
ప్రభ్‌సిమ్రాన్‌పై సెహ్వాగ్ ప్రశంసల వర్షం (PTI)

Sehwag on Prabhsimran: దిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాడు జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ శతకంతో అదరగొట్టాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా.. మొండిగా క్రీజులో నిలుచుని అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ప్రభ్‌సిమ్రాన్ గురించి స్పందించాడు. అతడిని కేవలం 60 లక్షలకే కొనుగోలు చేసినప్పటికీ.. వంద పరుగులతో ఆకట్టుకున్నాడని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

"ప్రభ్‌సిమ్రాన్‌ను కొనుగోలు చేసి పంజాబ్ కింగ్స్‌ ప్రయోజనం పొందింది. అతడు స్థిరంగా ఆడుతున్నాడు. అలాంటి ఆటగాడి నుంచి ఎంతో లాభం చేకూరుతుంది. అతడు తొలి సారి ఐపీఎల్‌కు వచ్చినప్పుడు రూ.4.8 కోట్లకు అమ్ముడుపోయాడు. కానీ ఈ సారి మాత్రం కేవలం రూ.60 లక్షల ధరే పలికాడు. కానీ ఈ రోజు అతడు తన ప్రతిభను చాటుకున్నాడు." అని సెహ్వాగ్ అన్నాడు.

సెహ్వాగ్ అంతటితో ఆగకుండా సామ్ కరన్‌ను ప్రభ్‌సిమ్రాన్‌తో పోల్చాడు. "ప్రభ్‌సిమ్రాన్ సెంచరీలు కొట్టగలనని నిరూపించాడు. కానీ అతడు రూ.60 లక్షల ధరే పలికాడు. అంత ఎక్కువ స్కోరు చేసే ఆటగాడు సెంచరీలు సాధించి కొన్ని మ్యాచ్‌లను గెలిపిస్తే అంతకంటే గొప్ప విషయం మరోకటి ఉండదు. మీరు సామ్ కరన్‌ను రూ.18.5 కోట్లు కొనుగోలు చేశారు.. అతడు ఏం చేశాడు?" అంటూ పంజాబ్ కింగ్స్‌ను సెహ్వాగ్ ప్రశ్నించాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సామ్ కరన్ రికార్డు సృష్టిచాడు రూ.18.5 కోట్లకు అతడిని పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్‌లో అతడు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. 12 మ్యాచ్‌ల్లో 216 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ధావన్ గైర్హాజరు కావడంతో రెండు మ్యాచ్‌లకు అతడు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

ఇక శనివారం నాడు దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 31 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 136 పరుగులకే పరిమితమైంది. డేవడ్ వార్నర్(54), ఫిలిప్ సాల్ట్(21) మెరుగైన ఆరంభం ఇచ్చినప్పటికీ పంజాబ్ స్పిన్నర్ల ధాటికి దిల్లీ ఓటమిని చవిచూసింది. వార్నర్ అర్ధశతకంతో రాణించినప్పటికీ మిగిలినవారు విఫలం కావడంతో చేజేతులా మ్యాచ్‌ను సమర్పించుకుంది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 4 వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్ చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం