Sehwag on Rohit: రోహిత్ బ్యాటింగ్ అస్సలు బాలేదు.. ఎందుకలా చేస్తున్నాడో: సెహ్వాగ్
Sehwag on Rohit: రోహిత్ బ్యాటింగ్ అస్సలు బాలేదు.. ఎందుకలా చేస్తున్నాడో అని అన్నాడు సెహ్వాగ్. అతడు కాస్త ఓపికగా ఆడాల్సిన అవసరం ఉన్నదని వీరూ స్పష్టం చేశాడు.
Sehwag on Rohit: గతేడాది ఐపీఎల్లో చివరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్.. ఈసారి ఫైనల్ బెర్త్ కోసం ఫైట్ చేయబోతోంది. అయితే ఆ టీమ్ సక్సెస్ అవుతున్నా కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ మాత్రం మెరుగుపడటం లేదు. డూ ఆర్ డై మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 57 రన్స్ చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించినా.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో విఫలమయ్యాడు.
అయితే రోహిత్ మరీ దూకుడుగా ఆడుతున్నాడని, కాస్త ఓపికగా ఉంటేనే ఫామ్ లోకి వస్తాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. "అతని బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. ఏదేదో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మూడు ఓవర్లలోనే 30 పరుగులు చేసినప్పుడు, తర్వాత ఓవర్లో మళ్లీ 20 పరుగులు చేయడానికి ఎందుకు ప్రయత్నించడం.
అతడు క్రీజులోనే ఉంటే లూజ్ బాల్స్ వస్తూనే ఉంటాయి. కానీ అతడు మాత్రం మంచి బంతులను కూడా బలవంతంగా అయినా ఫోర్లు, సిక్స్ లు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రీజు వదిలి ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. కాసేపు ఆగి ఓపికగా ఉంటే అతనికి మంచి జరుగుతుంది" అని సెహ్వాగ్ అన్నాడు.
"అతడు 57 పరుగులు చేసిన రోజు బౌలర్లపై విరుచుకుపడలేదు. ఓ బ్యాటర్ అయినా బౌలర్ అయినా ఓపికగా ఉండాలని మురళీధరన్ చెబుతుంటాడు. అందుకే రోహిత్ కాస్త ఓపికగా ఉండాలి. 200కుపైగా స్కోరు చేజ్ చేస్తుంటే అది వేరే విషయం. కానీ మొదట బ్యాటింగ్ చేస్తుంటే కాస్త టైమ్ తీసుకోవాలి. ప్రస్తుతానికి రోహిత్ బ్యాటింగ్ నాకు అస్సలు నచ్చడం లేదు" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2023 ఫైనల్లో చోటు కోసం శుక్రవారం (మే 26) గుజరాత్ టైటన్స్ తో రెండో క్వాలిఫయర్ లో ముంబై ఇండియన్స్ తలపడబోతోంది. గుజరాత్ వరుసగా రెండో ఏడాదీ ఫైనల్ చేరుతుందా లేక ముంబై ఏడోసారి టైటిల్ పోరుకు వెళ్తుందా అన్నది చూడాలి.
సంబంధిత కథనం