CSK vs GT: అర్ధశతకంతో విజృంభించిన రుతురాజ్.. గుజరాత్ ముందు మెరుగైన లక్ష్యం-ruturaj gaikwad hits to help chennai to get better target for gujarat ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ruturaj Gaikwad Hits To Help Chennai To Get Better Target For Gujarat

CSK vs GT: అర్ధశతకంతో విజృంభించిన రుతురాజ్.. గుజరాత్ ముందు మెరుగైన లక్ష్యం

Maragani Govardhan HT Telugu
Mar 31, 2023 09:48 PM IST

CSK vs GT: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో చెన్నై మెరుగైన స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. చెన్నై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అర్ధశతకంతో రాణించాడు.

చెన్నై-గుజరాత్
చెన్నై-గుజరాత్ (AP)

CSK vs GT: ఐపీఎల్ 2023లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో మెరుగైన స్కోరు నమోదైంది. అహ్మదబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(92) భారీ అర్ధశతకం చేయగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. దీంతో చెన్నై అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆరంభంలో ధారాళంగా పరుగులు సమర్పించిన గుజరాత్ బౌలర్లు.. సెకండాఫ్‌లో చెన్నై బ్యాటర్లకు కళ్లెం వేశారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ. అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

ట్రెండింగ్ వార్తలు

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కేకు శుభారంభమేమి దక్కలేదు. మూడో ఓవర్లోనే ఓపెన్ డేవాన్ కాన్వే‌ను(1) షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి మొయిన్ అలీ(23) సాయంతో మరో ఓపెనర్ రుతురాజ్ బ్యాటింగ్ కొనసాగించారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అయితే వేగంగా ఆడుతున్న మొయిన్ అలీని అల్జారీ జోసెఫ్ ఔట్ చేశాడు. ఆ కాసేపటికే ప్రమాదకర బెన్ స్టోక్స్‌ను(7) రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 70 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది చెన్నై.

ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ ఓపెనర్ రుతురాజ్ మాత్రం పరుగుల వేగాన్ని మాత్రం తగ్గించలేదు. బౌండరీలు, సిక్సర్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 23 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్నాడంటే అతడు ఎంత వేగంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. అయితే చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మొత్తంగా 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.

అయితే రుతురాజ్ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. అంబటి రాయుడు(12), శివమ్ దుబే(19), రవీంద్ర జడేజా(1) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. చివర్లో ధోనీ(14) కాసేపు మెరుపులు మెరిపించడంతో చెన్నై ఆ మాత్రం స్కోరైన చేయగలిగింది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి చెన్నై 178 పరుగులు చేయగలిగింది.

WhatsApp channel

సంబంధిత కథనం