Rohit Sharma trolls Aamir Khan: ఆమిర్ ఖాన్‌ను దారుణంగా ట్రోల్ చేసిన రోహిత శర్మ.. వీడియో వైరల్-rohit sharma trolls aamir khan in a ad shoot as the video gone viral
Telugu News  /  Sports  /  Rohit Sharma Trolls Aamir Khan In A Ad Shoot As The Video Gone Viral
ఆమిర్ ఖాన్‌పై పంచ్‌లేసి నవ్వుతున్న రోహిత్ శర్మ
ఆమిర్ ఖాన్‌పై పంచ్‌లేసి నవ్వుతున్న రోహిత్ శర్మ

Rohit Sharma trolls Aamir Khan: ఆమిర్ ఖాన్‌ను దారుణంగా ట్రోల్ చేసిన రోహిత శర్మ.. వీడియో వైరల్

31 March 2023, 15:42 ISTHari Prasad S
31 March 2023, 15:42 IST

Rohit Sharma trolls Aamir Khan: ఆమిర్ ఖాన్‌ను దారుణంగా ట్రోల్ చేశాడు రోహిత శర్మ.ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. డ్రీమ్ 11 యాడ్ లో భాగంగా చేసిన ఈ వీడియోలు నవ్వులు పంచేలా ఉన్నాయి.

Rohit Sharma trolls Aamir Khan: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కలిసి ఓ టీవీ కమర్షియల్ యాడ్ లో నటించారు. అయితే ఈ యాడ్స్ లో ఆమిర్ ను ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆడుకున్నాడు రోహిత్. అతనిపై పంచ్ లేస్తూ నవ్వుకున్నాడు. ఈ వీడియోలను రోహిత్ శుక్రవారం (మార్చి 31) తన ట్విటర్ అకౌంట్ లో షేర్ చేశాడు.

మామూలుగానే టీమ్ లోని యువ ఆటగాళ్లతో సరదాగా జోకులేస్తూ, నవ్వుతూ ఉండే రోహిత్.. ఇందులోనూ అలాగే కనిపించాడు. ఓ యాడ్ లో ఆమిర్ ఖాన్.. రోహిత్ శర్మకు బౌలింగ్ చేస్తుంటాడు. రోహిత్.. నీ మిడిల్ స్టంప్ ఎగిరిపోతుంది అంటూ ముందుగానే ఆమిర్ వార్నింగ్ ఇస్తాడు. తీరా బాల్ వేసిన తర్వాత రోహిత్ తనదైన స్టైల్లో దానిని బలంగా ఆమిర్ తలపై నుంచి బాదుతాడు.

ఆ బాల్ నుంచి కొద్దిలో తప్పించుకున్న ఆమిర్.. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ మళ్లీ బౌలింగ్ చేయడానికి వెళ్తాడు. ఇది అతని సూపర్ హిట్ మూవీ త్రీ ఇడియట్స్ లోని పాపులర్ డైలాగ్ అన్న విషయం తెలుసు కదా. ఇక మరో యాడ్ లో ఆమిర్ పై మాటలతో పంచ్ వేస్తాడు రోహిత్.

డగౌట్ లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా కూర్చున్న ఆమిర్.. రోహిత్ ను చూసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నాకే వస్తుంది అంటాడు. దీనికి రోహిత్ బదులిస్తే.. ఏం లాభం మీరు ఎలాగూ అవార్డులు తీసుకోవడానికి వెళ్లరు కదా అంటాడు. చాలా రోజులుగా ఆమిర్ ఖాన్ ఎలాంటి అవార్డుల కార్యక్రమాలకూ వెళ్లడం లేదు. దానిని ఉద్దేశించే రోహిత్ ఈ కామెంట్ చేయడం విశేషం.

ఈ యాడ్ లో రోహిత్, ఆమిర్ తోపాటు స్పిన్నర్ రాహుల్ చహర్ కూడా ఉన్నాడు. మరోవైపు ఐపీఎల్ 2023 సీజన్ శుక్రవారం (మార్చి 31) నుంచే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందుకున్నాడు.

సంబంధిత కథనం