Rohit Sharma Records: రోహిత్ పేరిట రెండు అరుదైన రికార్డులు.. కోహ్లీ సరసన నిలిచిన హిట్ మ్యాన్-rohit sharma bags two unbelievable records after kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma Bags Two Unbelievable Records After Kohli

Rohit Sharma Records: రోహిత్ పేరిట రెండు అరుదైన రికార్డులు.. కోహ్లీ సరసన నిలిచిన హిట్ మ్యాన్

Maragani Govardhan HT Telugu
May 21, 2023 10:13 PM IST

Rohit Sharma Records: ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ రెండు అరుదైన ఘనతలను సాధించాడు. ఓ ఫ్రాంఛైజీ తరఫున 5 వేల పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టీ20ల్లో మరో ఘనతను కూడా అందుకున్నాడు.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (Mumbai Indians Twiiter)

Rohit Sharma Records: ఆదివారం నాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతె తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్లు కేమరూన్ గ్రీన్(100) సెంచరీతో విజృంభించగా.. రోహిత్ శర్మ(56) అర్ధ శతకంతో రాణించాడు. ముఖ్యంగా హిట్ మ్యాన్ గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడు వరుసగా విఫలం కావడం వల్ల ఐపీఎల్‌ నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలని కూడా పలువురు మాజీలు సూచించారు. అయితే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఫామ్ పుంజుకుని అద్భుత ప్రదర్శన ఆకట్టుకుంటున్న మన హిట్ మ్యాన్ రెండు అరుదైన రికార్డులను నమోదు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

ముందుగా ఐపీఎల్‌లో ఓ జట్టు తరఫున 5 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ముంబయి తరఫున ఈ మైలురాయిని అందుకున్న హిట్ మ్యాన్. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ ఉన్నాడు. మొత్తంగా రోహిత్ శర్మ 241 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 6,191 పరుగులు చేశాడు. ఇందులో 5 వేల పరుగులు ముంబయి తరఫునే చేయగా.. మిగిలినవి డెక్కన్ ఛార్జర్స్‌తో ఆడినప్పుడు చేశాడు. ఈ విషయం కోహ్లీ ముందున్నాడు. విరాట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 7,162 పరుగులు చేశాడు.

ఇది కాకుండా రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. టీ2 ఫార్మాట్‌లో 11 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లీ 373 మ్యాచ్‌ల్లో 11,864 పరుగులతో హిట్ మ్యాన్ కంటే ముందున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 11 వేల మైలురాయి అందుకున్న 7వ బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పోలార్డ్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో హైదారాబాద్‌పై ముంబయి 8 వికెట్ల తేడాతో గెలిచింది. ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి బ్యాటర్ కేమరూన్ గ్రీన్(100*) సెంచరీతో విజృంభించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(56) అర్ధశతకంతో రాణించాడు.

WhatsApp channel