Rishah Pant: పంత్ వచ్చేస్తున్నాడు.. ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ చూడనున్న కెప్టెన్-rishah pant to watch delhi capitals and gujarat titans match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rishah Pant To Watch Delhi Capitals And Gujarat Titans Match

Rishah Pant: పంత్ వచ్చేస్తున్నాడు.. ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ చూడనున్న కెప్టెన్

Hari Prasad S HT Telugu
Apr 03, 2023 10:32 PM IST

Rishah Pant: పంత్ వచ్చేస్తున్నాడు.. ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ చూడనున్నాడు ఈ క్యాపిటల్స్ కెప్టెన్. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.

రిషబ్ పంత్
రిషబ్ పంత్

Rishah Pant: ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ మొత్తానికి క్రికెట్ స్టేడియంలో అడుగుపెడుతున్నాడు. అయితే మ్యాచ్ ఆడటానికి కాదు.. చూడటానికే. గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు.. ప్రస్తుతం కోలుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడతడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటానికి వస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్ మంగళవారం (ఏప్రిల్ 4) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. పంత్ లేకపోవడంతో ప్రస్తుతం ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి పంత్ వస్తున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) జాయింట్ సెక్రటరీ రాజన్ వెల్లడించారు. గాయంతో బాధపడుతున్నా.. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని పంత నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.

"ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. గాయంతో బాధపడుతున్నా కూడా పంత్ తన జట్టును సపోర్ట్ చేయడానికి వస్తున్నాడు. అతడు ఢిల్లీ స్టార్. అతన్ని ప్రేక్షకులు అభినందిస్తారని అనుకుంటున్నాను" అని రాజన్ అన్నారు. పంత్ కోసం స్టేడియంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ చెప్పారు.

పంత్ ను ఇంటి నుంచి తీసుకురావడం, తిరిగి డ్రాప్ చేయడంతోపాటు స్టేడియంలోనూ డగౌట్ వరకూ ప్రత్యేకమైన ర్యాంప్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ సరే అంటే ఏర్పాట్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. పంత్ ఆడకపోయినా.. స్టేడియానికి వచ్చి తమతోపాటు డగౌట్ లో కూర్చుంటే బాగుంటుందని మొదటి నుంచీ కోచ్ పాంటింగ్ అంటున్నాడు.

ఇప్పుడు అతని కోరికను మన్నించి పంత్ నేరుగా స్టేడియానికి వస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఊతకర్రల సాయంతో మెల్లగా నడుస్తున్నాడు. అయితే అతడు క్రికెట్ ఆడటానికి మాత్రం మరికొన్ని నెలల సమయం పట్టనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం