IPL 2023 Points Table: దిల్లీ-పంజాబ్ మ్యాచ్ తర్వాత వచ్చిన మార్పులివే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ యాధాతథం-punjab kings placed in 6th spot in ipl 2023 points table after win against delhi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Punjab Kings Placed In 6th Spot In Ipl 2023 Points Table After Win Against Delhi

IPL 2023 Points Table: దిల్లీ-పంజాబ్ మ్యాచ్ తర్వాత వచ్చిన మార్పులివే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ యాధాతథం

Maragani Govardhan HT Telugu
May 14, 2023 09:04 AM IST

IPL 2023 Points Table: శనివారం నాడు దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో పంజాబ్ ఆరో స్థానంలో ఉండగా.. దిల్లీ చివరి స్థానంలో కొనసాగుతోంది. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో మాత్రం ఎలాంటి మార్పు సంభవించలేదు.

దిల్లీపై పంజాబ్ విజయం
దిల్లీపై పంజాబ్ విజయం (Rahul Singh)

IPL 2023 Points Table: శనివారం నాడు జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించి తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ 4 వికెట్లతో విజృంభించగా.. అంతకుముందు బ్యాటింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ 31 పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ పరాజయంతో దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించినట్లయింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో 12 పాయింట్లు సాధించింది. మరోపక్క దిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 విజయాలు సాధించి 8 పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇక అగ్రస్థానంలో 8 విజయాలతో గుజరాత్ టైటాన్స్ ఉండగా.. 7 విజయాలతో చెన్నై రెండో స్థానంలో నిలిచింది.

ఆరెంజ్ క్యాప్..

ఇప్పటివరకు జరిగిన టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 57.60 సగటుతో 576 పరుగులు చేశాడు. అతడి తర్వాత రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 12 మ్యాచ్‌ల్లో 575 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. 12 మ్యాచ్‌ల్లో 479 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

పర్పుల్ క్యాప్..

ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పర్పుల్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. 12 మ్యాచ్‌ల్లో అతడు 23 వికెట్లు తీశాడు. అతడి తర్వాత రాజస్థాన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 12 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. 19 వికెట్లతో ముంబయి స్పిన్నర్ పియూష్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక శనివారం నాడు దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 31 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 136 పరుగులకే పరిమితమైంది. డేవడ్ వార్నర్(54), ఫిలిప్ సాల్ట్(21) మెరుగైన ఆరంభం ఇచ్చినప్పటికీ పంజాబ్ స్పిన్నర్ల ధాటికి దిల్లీ ఓటమిని చవిచూసింది. వార్నర్ అర్ధశతకంతో రాణించినప్పటికీ మిగిలినవారు విఫలం కావడంతో చేజేతులా మ్యాచ్‌ను సమర్పించుకుంది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 4 వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్ చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం