Tnpl League: ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లతో 33 రన్స్ - తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలనం
Tnpl League: తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రాయల్ కింగ్స్ ప్లేయర్స్ రితిక్ ఈశ్వరన్, అజితేష్ గురుస్వామి బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లతో 33 రన్స్ చేశారు.

Tnpl League: తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో నెల్లై రాయల్ కింగ్స్ ప్లేయర్స్ రితిక్ ఈశ్వరన్, అజితేష్ గురుస్వామి సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం రాయల్ కింగ్స్ 12 బాల్స్‌లో 37 రన్స్ చేయాల్సిన తరుణంలో ఒకే ఓవర్‌లో 33 రన్స్ చేసి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. రితిక్ ఈశ్వరన్, అజితేష్ ధనాధన్ ఇన్నింగ్స్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో రితిక్ ఈశ్వరన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 11 బాల్స్‌లోనే ఆరు సిక్సర్లతో 39 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగల్ డ్రాగన్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 185 రన్స్ చేసింది. దిండిగల్ డ్రాగన్స్ ఓపెనర్ శివమ్ సింగ్ 46 బాల్స్‌లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 76 రన్స్ చేశాడు. భూపతి కుమార్ 41 రన్స్‌తో రాణించాడు.
186 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన రాయల్ కింగ్స్ అజితేష్, రితిక్ అసమాన పోరాటంతో చివరి బాల్‌కు విజయాన్ని అందుకున్నది. అరుణ్ కార్తిక్, సుగేంద్రన్‌తో పాటు నితీష్ రాజగోపల్ నెమ్మదిగా ఆడటంతో రాయల్స్ కింగ్స్ గెలుపు ఆనుమానంగా మారింది. ఓ వైపు వికెట్లు పడుతోన్న అజితేష్ గురుస్వామి మాత్రం ఫోర్లు సిక్సర్లతో దూకుడు పెంచుతూ వచ్చాడు.
రాయల్ కింగ్స్ గెలుపుకు 12 బాల్స్‌లో 37 రన్స్ అవసరమైన తరుణంలో గేర్ మార్చిన రితిక్ ఈశ్వరన్ 19వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టాడు. అజిత్ గురుస్వామి ఓ సిక్స్ దంచాడు. ఓ నోబాల్, సింగిల్ రన్‌తో మొత్తంగా ఆ ఓవర్‌లో 33 రన్స్ వచ్చాయి.
ఆ తర్వాత మరో సిక్స్‌తో రాయల్ కింగ్స్‌కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు రితిక్ ఈశ్వరన్. అజితేష్ గురుస్వామి 44 బాల్స్‌లోనే ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 73 రన్స్, రితిక్ ఈశ్వరన్ 11 బాల్స్‌లో ఆరు సిక్సర్లతో 39 రన్స్ తో నాటౌట్‌గా మిగిలారు.
టాపిక్