Mitchell Marsh: పెళ్లి కోసం ఐపీఎల్ వదిలి వెళ్తున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్-mitchell marsh is getting married and to miss few ipl matches for delhi capitals ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Mitchell Marsh Is Getting Married And To Miss Few Ipl Matches For Delhi Capitals

Mitchell Marsh: పెళ్లి కోసం ఐపీఎల్ వదిలి వెళ్తున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

Hari Prasad S HT Telugu
Apr 07, 2023 06:13 PM IST

Mitchell Marsh: పెళ్లి కోసం ఐపీఎల్ వదిలి వెళ్తున్నాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరఫున ఆడుతున్న మార్ష్ కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు.

మిచెల్ మార్ష్
మిచెల్ మార్ష్ (ICC Twitter)

Mitchell Marsh: ఐపీఎల్ కు ఎప్పటిలాగే ఈసారి కూడా గాయాలు, ఇతర కారణాల వల్ల స్టార్ ప్లేయర్స్ దూరమవుతూనే ఉన్నారు. ఈసారి గాయం కారణంగా బుమ్రా, విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ దూరమయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మిచెల్ మార్ష్ కూడా కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

దీనికి కారణం అతడు పెళ్లి చేసుకోబోతుండటమే. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అయిన మార్ష్ పెళ్లి కోసం ఐపీఎల్ వదిలి స్వదేశానికి వెళ్తున్నాడు. ఐపీఎల్ 2023లో ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ మార్ష్ ఆడాడు. అయితే ఇప్పుడు పెళ్లి కోసం వెళ్తుండటంతో రానున్న కొన్ని మ్యాచ్ లకు అతడు దూరంగా ఉండనున్నాడు. ఢిల్లీ ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది.

ఇప్పుడు మార్ష్ కూడా దూరమవడం ఆ టీమ్ కు మింగుడు పడటం లేదు. ఈ మధ్యే గాయం నుంచి కోలుకొని ఢిల్లీ టీమ్ లో అడుగుపెట్టాడు మిచెల్ మార్ష్. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో బౌలింగ్ కూడా చేశాడు. అయితే రెండు మ్యాచ్ లలోనూ బ్యాట్ తో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్ లో గోల్డెన్ డక్ కాగా.. రెండో మ్యాచ్ లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.

మార్ష్ పెళ్లి చేసుకోబోతున్నాడని, అందుకే కొన్ని మ్యాచ్ లకు అతడు దూరం కానున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్ మెంబర్ అయిన జేమ్స్ హోప్స్ చెప్పాడు. ఆల్ రౌండర్ మార్ష్ దూరం కావడంతో అతని స్థానంలో రోవ్‌మన్ పావెల్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తర్వాతి మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులతో ఆడనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం