Jaydev Unadkat Replacement: ఉనాద్కట్ స్థానంలో యువ ఆల్ రౌండర్‌కు అవకాశమిచ్చిన లక్నో
Jaydev Unadkat Replacement: లక్నో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ముంబయికి చెందిన సూర్యాంష్‌కు అవకాశం కల్పించింది లక్నో జట్టు. 20 ఏళ్ల ఈ యువ ఆల్ రౌండర్‌ను లక్నో రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.
Jaydev Unadkat Replacement: లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్నా మెరుగైన ప్రదర్శనతో రాణిస్తోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్ దూరం కాగా.. ఆ టీమ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఇటీవలే గాయపడ్డాడు. భుజం గాయంతో దూరమైన అతడి స్థానంలో తాజాగా మరో ఆటగాడిని బరిలోకి దించుతోంది లక్నో. ముంబయికి చెందిన 20 ఏళ్ల ఆల్ రౌండర్ సూర్యాంష్ షెగ్డేను ఎంపిక చేసింది. కేకేఆర్‌తో జరగనున్న తన చివరి లీగ్ మ్యాచ్‌కు సుయాంష్ అందుబాటులో ఉంటాడు.
సూర్యాంష్ షెగ్డేను లక్నో సూపర్ జెయింట్స్ అతడి బేస్ ప్రైస్ రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ఇంత వరకు ఆడించని అతడిని.. ఉనాద్కత్ స్థానంలో ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొంది.
లక్నో సూపర్ జెయింట్స్ తరఫున జయదేవ్ ఉనాద్కట్ 3 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ట్రైనింగ్ సెషన్‌లో భుజానికి గాయమవడంతో అతడు దూరమయ్యాడు. ఏప్రిల్ 11న కిందున్న తాడు తగిలి జారిపడిన ఉనాద్కత్.. బౌలింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డాడు. అప్పటి నుంచి ఇంతవరకు అతడు ఆడలేదు.
ముంబయి క్రికెట్ సర్క్యూట్‌లో సూర్యాంష్‌కు మంచి ఆల్ రౌండర్‌గా పేరుంది. 20 ఏళ్ల ఈ యువకెరటం ముంబయి రంజీ జట్టులోనూ భాగమయ్యాడు. అండర్-25 స్టేట్-ఏ ట్రోఫీలో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 184 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధశతకాలు ఉన్నాయి. అంతేకాకుండా 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఉనాద్కత్ కంటే ముందు లక్నో జట్టులో కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డాడు. తొడ గాయం కారణంగా పూర్తి టోర్నీకి దూరమయ్యాడు. ఆర్సీబీతో ఈ నెల 1న జరిగిన మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు.
సంబంధిత కథనం