Jadeja to Dhoni: త్వరలోనే ఎల్లో జెర్సీలో కలుద్దాం.. ధోనీకి జడేజా బర్త్‌డే విషెస్ వైరల్-jadeja to dhoni says will meet soon in yellow jersey ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Jadeja To Dhoni Says Will Meet Soon In Yellow Jersey

Jadeja to Dhoni: త్వరలోనే ఎల్లో జెర్సీలో కలుద్దాం.. ధోనీకి జడేజా బర్త్‌డే విషెస్ వైరల్

Hari Prasad S HT Telugu
Jul 07, 2023 04:03 PM IST

Jadeja to Dhoni: త్వరలోనే ఎల్లో జెర్సీలో కలుద్దాం అంటూ ధోనీకి జడేజా చేసిన బర్త్‌డే విషెస్ వైరల్ అవుతోంది. అంటే వచ్చే ఏడాది కూడా ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడటం ఖాయమని తేలిపోయినట్లే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఐపీఎల్ ట్రోఫీతో ధోనీ, జడేజా
ఐపీఎల్ ట్రోఫీతో ధోనీ, జడేజా (ANI)

Jadeja to Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం (జులై 7) తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. దీంతో అతనికి క్రికెట్ ప్రపంచమంతా బర్త్ డే విషెస్ చెబుతోంది. అతని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్మేట్ రవీంద్ర జడేజా కూడా విషెస్ చెప్పాడు. అయితే ఇప్పుడు జడేజా చేసిన ట్వీట్ మాత్రమే వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఎందుకంటే అందులో వచ్చే ఏడాది కూడా ధోనీ ఐపీఎల్ ఆడబోతున్నాడన్న హింట్ ఇచ్చాడు జడేజా. "నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉండే వ్యక్తి. 2009 నుంచి ఇప్పటి వరకు. ఎప్పటికీ కూడా. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు మహీ భాయ్. త్వరలోనే ఎల్లో జెర్సీలో కలుద్దాం" అని జడేజా ట్వీట్ చేశాడు. అది చూసి ఫ్యాన్స్ వచ్చే ఏడాది ధోనీ ఆడతాడని జడేజా చెప్పేశాడంటూ పండగ చేసుకుంటున్నారు.

మరోవైపు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ధోనీకి బర్త్ డే విషెస్ చెప్పాడు. నా ఫేవరెట్ ఎమ్మెస్ ధోనీకి హ్యాపీ బర్త్ డే అని హార్దిక్ ట్వీట్ చేశాడు. నీపై ఆ దేవుడు ఆశీర్వచనాలు కురిపిస్తూనే ఉండనీ అంటూ మహ్మద్ షమి కూడా ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇక ధోనీకి మరో బెస్ట్ ఫ్రెండ్ సురేశ్ రైనా కూడా తనదైన స్టైల్లో విషెస్ చెప్పాడు.

"నా అన్న ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. పిచ్ నుంచి కలల వరకూ అన్నీ పంచుకున్న మన మధ్య బంధం ఎప్పుడూ దృఢంగా ఉంటుంది. ఓ నాయకుడిగా, స్నేహితుడిగా నీ బలం నాకు మార్గదర్శకం. నీకు మరింత సంతోషం, సక్సెస్, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను. కీప్ షైనింగ్, కీప్ లీడింగ్, కీప్ స్ప్రెడింగ్ యువర్ మ్యాజిక్" అని రైనా ట్వీట్ చేశాడు.

42వ పుట్టిన రోజు జరుపుకున్న ధోనీ వచ్చే ఏడాది కూడా అదే ఫిట్‌నెస్ తో ఐపీఎల్ ఆడగలడా లేదా అన్నది చూడాలి. ఈ మధ్యే తన మోకాలికి కూడా సర్జరీ చేయించుకున్నాడు. వచ్చే ఏడాది ఆడేదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేనని, దానికి చాలా సమయం ఉందని ఐపీఎల్ ఐదో టైటిల్ గెలిచిన తర్వాత ధోనీ చెప్పడం చూస్తే 2024 సీజన్ లో అతడు ఆడతాడన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం