IPL in Guwahati: గౌహతిలో ఐపీఎల్ మ్యాచ్ ఎందుకు.. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా?-ipl in guwahati as the rajastan royals team chose it as their second home ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl In Guwahati: గౌహతిలో ఐపీఎల్ మ్యాచ్ ఎందుకు.. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా?

IPL in Guwahati: గౌహతిలో ఐపీఎల్ మ్యాచ్ ఎందుకు.. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా?

Hari Prasad S HT Telugu

IPL in Guwahati: గౌహతిలో ఐపీఎల్ మ్యాచ్ ఎందుకు జరుగుతోంది? అసలు ఈ మెగా లీగ్ లో నార్త్ ఈస్ట్ నుంచి టీమ్ లేకపోయినా అస్సాంలో ఈ మ్యాచ్ నిర్వహించడానికి కారణమేంటి? అయితే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరు తెలుసుకోవాలి?

గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ (PTI)

IPL in Guwahati: 15 ఏళ్లుగా భారత క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ తొలిసారి ఈశాన్య భారతంలో అడుగుపెడుతోంది. 2008లో లీగ్ ప్రారంభమైన తర్వాత తొలిసారి ఈ సీజన్ లో అస్సాంలోని గౌహతిలో ఉన్న బర్సపారా స్టేడియం రెండు మ్యాచ్ లకు వేదిక కానుంది. అందులో ఒకటి బుధవారమే (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది.

ఇక మరో మ్యాచ్ ఏప్రిల్ 8న ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్స్ ఆడనుంది. అయితే ఎప్పుడూ లేనిది ఈసారి గౌహతి ఐపీఎల్ మ్యాచ్ లకు ఎందుకు ఆతిథ్యమిస్తోందో తెలుసా? రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఈ స్టేడియాన్ని తన సెకండ్ హోమ్ గా మార్చుకుంది. అంటే ఆ టీమ్ జైపూర్ తోపాటు గౌహతిలోనూ హోమ్ మ్యాచ్ లు ఆడుతుంది. ఐదు మ్యాచ్ లు జైపూర్ లో, రెండు మ్యాచ్ లు గౌహతిలో జరుగుతాయి.

గౌహతిలో ఐపీఎల్

ఈశాన్య భారతంలో క్రికెట్ అభివృద్ధి కోసం రాజస్థాన్ రాయల్స్ నడుం బిగించింది. అందులో భాగంగానే అస్సాంలోని గౌహతిని తమ సెకండ్ హోహ్ గా ఎంచుకుంది. ఇక్కడ రెండు మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించింది. నిజానికి ఐపీఎల్ ను నార్త్ ఈస్ట్ లోకి తీసుకురావడానికి అస్సాం క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా ప్రయత్నించింది. 2020లోనే గౌహతిలో రెండు మ్యాచ్ లు షెడ్యూల్ చేశారు.

అయితే ఆ ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్ యూఏఈకి తరలిపోయింది. ఈ ఏడాది మళ్లీ హోమ్, అవే పద్ధతిలో మ్యాచ్ లు నిర్వహించాలని నిర్ణయించడంతో మొత్తానికి గౌహతికి ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కుతోంది. రాయల్స్ దీనిని తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా మార్చుకొని మ్యాచ్ లు నిర్వహించడంతోపాటు ఇక్కడి యువ క్రికెటర్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది.

గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగాయి. ఈ మధ్యే జనవరి 10న ఇండియా, శ్రీలంక మధ్య వన్డే జరిగింది. గతేడాది అక్టోబర్ 2న ఇండియా, సౌతాఫ్రికా టీ20, 2018లో ఇండియా, వెస్టిండీస్ వన్డే, 2017లో ఇండియా, ఆస్ట్రేలియా టీ20 జరిగాయి. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద స్టేడియం అయిన బర్సపారాలో 40 వేల మంది మ్యాచ్ చూసే అవకాశం ఉంది.

సంబంధిత కథనం