IPL Points Table 2023 : ఐపీఎల్ పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఏంటి?-ipl 2023 points table today after the completion of sunrisers hyderabad vs rajasthan royals match ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Ipl 2023 Points Table Today After The Completion Of Sunrisers Hyderabad Vs Rajasthan Royals Match

IPL Points Table 2023 : ఐపీఎల్ పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఏంటి?

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ (IPL)

IPL Points Table 2023 Today : ఆదివారం(మే 7) జరిగిన మ్యాచ్‌లతో పాయింట్స్ టేబుల్ లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ జట్టు.. తొమ్మిదో స్థానంలోకి వచ్చింది. గుజరాత్ మెుదటి ప్లేసులోనే కొనసాగుతోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 16వ ఎడిషన్‌ లీగ్ దశలో 51, 52వ మ్యాచ్‌లు మే 7న ఆదివారం జరిగాయి. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 56 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

గుజరాత్ టైటాన్స్ సునాయాస విజయంతో మరో రెండు పాయింట్లు సాధించి ప్లేఆఫ్‌కు చేరువగా ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆశ్చర్యకరంగా పునరాగమనం చేసింది.

ఈ విజయాలతో స్టాండింగ్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టాండింగ్స్‌లో పదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. తొమ్మిదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పదో స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ అదే స్థానాల్లో కొనసాగాయి. ఈ రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఏయే జట్లు ఏ స్థానాల్లో ఉన్నాయి?

1. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌లు ఓడి 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

2. చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.

3. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 10 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయి. ఒక్క మ్యాచ్‌ రద్దు అయింది. 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

4. రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది.

5. 10 మ్యాచుల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌లు ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

6. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

7. పంజాబ్ కింగ్స్ జట్టు 10 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌లు ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

8. కోల్‌కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.

9. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడి 8 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది.

10. 10 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది.