IPL 2023 Playoff : తప్పదు గట్టిగా గెలవాల్సిందే.. ఆర్సీబీ, ముంబైలో ఒకే జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశం!-ipl 2023 playoff scenario rcb will get qualify if they beat gt with better run rate compare to mi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Playoff Scenario Rcb Will Get Qualify If They Beat Gt With Better Run Rate Compare To Mi

IPL 2023 Playoff : తప్పదు గట్టిగా గెలవాల్సిందే.. ఆర్సీబీ, ముంబైలో ఒకే జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశం!

Anand Sai HT Telugu
May 21, 2023 07:55 AM IST

IPL 2023 Playoff Scenario : ఐపీఎల్ 2023 ఫైనల్ కు దగ్గరలో ఉంది. ఇప్పుడు ప్లేఆఫ్ కోసం జట్లు పోటీ పడుతున్నాయి. మే 21న కీలక మ్యాచ్ లు జరగనున్నాయి.

కోహ్లీ, రోహిత్
కోహ్లీ, రోహిత్ (twitter)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారవ ఎడిషన్‌లో మే 20న రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(CSK VS DC) తలపడగా, రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(LSG Vs KKR) తలపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 77 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ 1 పరుగు తేడాతో ఉత్కంఠ విజయంతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఏ జట్టు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుందనే సమాచారం ఇలా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

13 మ్యాచ్‌లలో 9 విజయాలు, 4 ఓటములతో గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. గుజరాత్ తమ చివరి మ్యాచ్‌లో RCBతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా, గుజరాత్‌కు టాప్ 2 స్థానం ఖాయం.

14 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడి, ఒక్క మ్యాచ్‌లో ఫలితం కనిపించని చెన్నై సూపర్ కింగ్స్ 17 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి గుజరాత్‌తో క్వాలిఫయర్ ఆడేందుకు అర్హత సాధించింది.

14 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి, 4 మ్యాచ్‌లు ఓడి, 1 మ్యాచ్‌లో ఓడిన లక్నో సూపర్ జెయింట్ 17 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.

13 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్ గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ మంచి రన్స్ తో గెలిస్తే సులభంగా ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి 7 మ్యాచ్‌లు ఓడిపోయి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఓడిపోయి రాజస్థాన్ రాయల్స్ కంటే తక్కువ నెట్ రన్ రేట్ పొందితే, అప్పుడు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది.

13 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిన ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. భారీ తేడాతో మరో మ్యాచ్ గెలవాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే ఎక్కువ నెట్ రన్ రేట్ వస్తే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది.

14 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి, 7 మ్యాచ్‌లు ఓడిపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ 12 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది, మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా 14 పాయింట్లు సాధిస్తుంది అంతే. ప్లేఆఫ్‌ అవకాశాన్ని కోల్పోతుంది. .

14 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

14 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 8 మ్యాచ్‌లు ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్ రేసుకు దూరమైంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి 9 మ్యాచ్‌లు ఓడి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుండి జట్టు నిష్క్రమించింది.

WhatsApp channel