IPL Finals CSK : ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్స్‌కు చేరుకున్న చెన్నై.. వావ్ గ్రేట్-ipl 2023 chennai super kings entered final for 10th time in 14 ipl seasons ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Chennai Super Kings Entered Final For 10th Time In 14 Ipl Seasons

IPL Finals CSK : ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్స్‌కు చేరుకున్న చెన్నై.. వావ్ గ్రేట్

Anand Sai HT Telugu
May 24, 2023 10:14 AM IST

IPL Finals CSK : మే 23న గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో గెలిచింది చెన్నై. దీంతో ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటి వరకూ 10 సార్లు చెన్నై జట్టు ఫైనల్స్ ఆడింది.

చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

మార్చి నెలాఖరున ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) టోర్నమెంట్ పదహారవ ఎడిషన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగియగా, ఇప్పుడు ప్లేఆఫ్ దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయవంతంగా ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌(GT Vs CSK) మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్‌కు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ధాటికి 20 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటై 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు అర్హత సాధించింది. 2016, 2017లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లలో ఆడని చెన్నై సూపర్ కింగ్స్ 14 ఇండియన్ ప్రీమియర్ టోర్నమెంట్‌లు ఆడింది. అందులో వారు 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుని 10 సార్లు ఫైనల్స్‌లోకి ప్రవేశించారు.

2008 ఐపీఎల్ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

2009 ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

2010 ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.

2011 ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.

2012 ఐపీఎల్ టోర్నీలో ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది.

2013 ఐపీఎల్ టోర్నీలో ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది.

2014 ఐపీఎల్ టోర్నీలో ప్లేఆఫ్స్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో క్వాలిఫయర్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో ఓడిపోయింది.

2015 ఐపీఎల్ టోర్నీలో ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది.

2018 ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.

2019 ఐపీఎల్ టోర్నీలో ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

2020 ఐపీఎల్ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఏడో స్థానంలో నిలిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

2021 ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది.

2022 ఐపీఎల్ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానం దక్కించుకుని లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

WhatsApp channel

సంబంధిత కథనం