IPL 2023 : RCB Vs GT మ్యాచ్‌కు వరుణుడి భయం.. మ్యాచ్ రద్దు అయితే ఎవరికి లాభం?-ipl 2023 bengaluru weather effect on rcb vs gt match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Bengaluru Weather Effect On Rcb Vs Gt Match

IPL 2023 : RCB Vs GT మ్యాచ్‌కు వరుణుడి భయం.. మ్యాచ్ రద్దు అయితే ఎవరికి లాభం?

Anand Sai HT Telugu
May 21, 2023 06:40 AM IST

IPL 2023 RCB Vs GT : ఐపీఎల్ లో ముగింపు దశకు చేరుకుంటుంది. ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించేందుకు జట్లు పోరాడుతున్నాయి. మే 21న కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. మెుదట ముంబయి ఇండియన్స్ జట్టు హైదరాబాద్ తో తలపడుతుంది. ఆ తర్వాత రాత్రి గుజరాత్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ఉండనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి భయం పట్టుకుంది.

చిన్నస్వామి స్టేడియం
చిన్నస్వామి స్టేడియం

ఐపీఎల్(IPL)లో కీలక మ్యాచ్ లు జరుగుతున్నాయి. ప్లేఆఫ్స్ కోసం జట్లు విపరీతంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు నిష్క్రమించగా.. మిగిలిన జట్లు పోరులో ఉన్నాయి. ఆర్సీబీ జట్టు(RCB Team) కూడా పోటీలో ఉంది. RCB 16 పాయింట్లు సేకరిస్తేనే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. ఆ విధంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్ RCBకి డూ ఆర్ డై మ్యాచ్.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి RCB, గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆర్‌సీబీకి కీలకమైన ఈ గేమ్‌లో గెలిచి 2 పాయింట్లు సాధించాలి. ఎందుకంటే 16 పాయింట్లు సాధిస్తేనే ఆర్‌సీబీకి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్ RCBకి కీలకం.

అయితే అక్యూవెదర్ ప్రకారం ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించనున్నాడు. సాయంత్రం 4 గంటల నుంచి మేఘావృతమైన వాతావరణం ఉంటుందని తెలిపింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, సాయంత్రం 5, 7, 9 గంటలకు వర్షం కురుస్తుందని వెదర్ రిపోర్ట్(Weather Report) ఉంది. అందుకే ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానం తలెత్తింది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే, ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున కేటాయిస్తారు. దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించడం అనుమానమే. ఎందుకంటే ముంబై ఇండియన్స్(Mumbai Indians) 16 పాయింట్లు సాధిస్తుంది. ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రద్దైతే పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 15 పాయింట్లతో వెనుకంజలో ఉంటుంది. ముంబై ఇండియన్స్ గెలిస్తే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది. అందుకే మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్ కల కూడా గల్లంతవుతుంది.

ఓ మోస్తరు వర్షం కురిస్తే మ్యాచ్ ఆడేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం గ్రౌండ్‌లో సబ్-ఎయిర్ సిస్టమ్ ఉన్నందున, ఈ యంత్రం భూమిలోని నీటిని త్వరగా పీల్చుకుంటుంది. దీని ప్రకారం, 15 నిమిషాల్లో మైదానాన్ని పూర్తిగా ఎండబెట్టి, మ్యాచ్‌కు సిద్ధం చేయవచ్చు. అందువల్ల ఓ మోస్తరు వర్షం కురిస్తే కచ్చితంగా మ్యాచ్ జరుగుతుందని చెప్పొచ్చు.

WhatsApp channel