West Indies Test Squad: ఎవ‌ర్రా మీరంతా - వెస్టిండీస్ టెస్ట్ టీమ్‌పై నెటిజ‌న్ల ఫ‌న్నీ కామెంట్స్‌-india vs west indies series netizens trolls on west indies test team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  West Indies Test Squad: ఎవ‌ర్రా మీరంతా - వెస్టిండీస్ టెస్ట్ టీమ్‌పై నెటిజ‌న్ల ఫ‌న్నీ కామెంట్స్‌

West Indies Test Squad: ఎవ‌ర్రా మీరంతా - వెస్టిండీస్ టెస్ట్ టీమ్‌పై నెటిజ‌న్ల ఫ‌న్నీ కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu

West Indies Test Squad: ఇండియాతో జ‌రుగ‌నున్న టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక‌చేసిన జ‌ట్టును సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. దాదాపు అంద‌రూ కొత్త ముఖాలే క‌నిపించ‌డంతో టెస్ట్ సిరీస్‌ను ఇండియా క్లీన్‌స్వీప్ చేయడం ప‌క్కా అంటూ పేర్కొంటున్నారు.

ర‌ఖీమ్ కార్న్‌వాల్‌

West Indies Test Squad: ఇండియాతో జ‌రుగ‌నున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సీనియ‌ర్ల‌కు ఉద్వాస‌న ప‌లికిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ దాదాపు అంద‌రూ కొత్త ప్లేయ‌ర్స్‌కు అవ‌కాశం ఇచ్చింది.

ఇందులో బ్రాత్‌వైట్, హోల్డ‌ర్‌, కీమ‌ర్ రోచ్ మిన‌హా మిగిలిన వారంద‌రూ కొత్త‌వాళ్లే కావ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రికి ప‌ట్టుప‌ది ప‌ది మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం కూడా లేదు. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మెకంజీ, అంతాంజే అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు.

ర‌ఖీమ్ కార్నివాల్ కూడా ఏడాది విరామం త‌ర్వాత ఇండియా సిరీస్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి పున‌రాగ‌మ‌నం చేయ‌బోతున్నాడు. ఈ టెస్ట్ టీమ్‌పై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. రేయ్ ఎవ‌ర్రా మీరంతా అంటూ ఓ నెటిజ‌న్ వెస్టిండీస్ టీమ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు.

టెస్ట్ సిరీస్‌ను ఇండియా క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మంటూ మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. ఇండియా, వెస్టిండీస్ మ‌ధ్య‌ టెస్ట్‌లు ఐదు రోజుల్లో కాకుండా మూడు రోజుల్లోనే ముగియ‌డం ఖాయ‌మంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు.ఈ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

సిరీస్ షెడ్యూల్ ఇదే...

వెస్టిండీస్ మ‌ధ్య మొద‌టి టెస్ట్ జూలై 12 నుంచి 16వ‌ర‌కు జ‌రుగ‌నుంది. రెండో టెస్ట్ 20 నుంచి 24 వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ఆ త‌ర్వాత మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. గ‌త కొంత‌కాలంగా సీనియ‌ర్స్ వ‌రుస‌గా విఫ‌లం కానుండ‌టంతో వారిని టెస్ట్ సిరీస్ నుంచి ఉద్వాస‌న ప‌లికిన‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్స్ టోర్నీలో స్కాట్లాండ్‌, నెదార్లాండ్స్ వంటి చిన్న జ‌ట్ల చేతిలో ఓట‌మి పాలైంది వెస్టిండీస్‌. వ‌ర‌ల్డ్ క‌ప్‌కు క్వాలిఫై కాలేదు. దాంతో వెస్టిండీస్ టీమ్‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. అందుకే టెస్ట్ సిరీస్ కోసం కొత్త ముఖాల‌కు ఛాన్స్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.