Dinesh Karthik : ఆర్సీబీకి మరో షాక్.. నెక్ట్స్ మ్యాచ్ దినేష్ కార్తీక్ ఆడతాడా?-dinesh karthik feeling unwell after mi vs rcb what about next match rr vs rcb ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dinesh Karthik Feeling Unwell After Mi Vs Rcb What About Next Match Rr Vs Rcb

Dinesh Karthik : ఆర్సీబీకి మరో షాక్.. నెక్ట్స్ మ్యాచ్ దినేష్ కార్తీక్ ఆడతాడా?

Anand Sai HT Telugu
May 11, 2023 10:32 AM IST

IPL 2023 RCB : ఈ ఏడాది ఐపీఎల్ లో బెంగళూరు జట్టు.. ఇబ్బందులు పడుతోంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే తాజాగా ఆర్సీబీకి మరో షాక్ తగిలింది.

దినేష్ కార్తీక్
దినేష్ కార్తీక్

ఐపీఎల్ 16వ(IPL) ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైఫల్యం కొనసాగుతోంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి ఆరు మ్యాచ్‌ల్లో ఓడి 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో మైనస్ రన్ రేట్‌తో ఉన్న RCBకి ప్లే ఆఫ్ మార్గం అంత ఈజీ కాదు. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధిస్తేనే తదుపరి దశకు చేరుకోవచ్చు. ఇది కాకుండా, ఇతర జట్ల ఫలితాల కూడా ప్రభావితం చేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇలా కష్టాల్లో ఉన్న RCBకి మరో షాక్ తగిలినట్టైంది. జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తీక్(Dinesh Karthik) ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కార్తీక్ అనారోగ్యంతో(Karthik Health Issue) బాధపడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో దినేష్ కార్తీక్.. జట్టుకు మంచి సహకారం అందించాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 పరుగులు చేశాడు. పెవిలియన్‌కి వెళ్తున్న సమయంలో కార్తీక్ బాగా దగ్గుతూ కనిపించాడు.

ముంబైతో మ్యాచ్ మధ్యలో కార్తీక్ ఆరోగ్యం ఇబ్బంది పెట్టింది. ఈ విషయాన్ని ప్రధాన కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. 'మ్యాచ్ సమయంలో దినేశ్ కార్తీక్ అస్వస్థతకు గురయ్యాడు. మ్యాచ్ సందర్భంగా వాంతులు కూడా చేసుకున్నాడు. ఆయన మా బృందంలో ముఖ్యమైన సభ్యుడు. జట్టులో దినేష్ పాత్ర కీలకం.' అని బంగర్ చెప్పాడు.

ఇన్నింగ్స్ సమయంలో దినేష్ కార్తీక్ అస్వస్థతకు(Dinesh Karthik Health) గురయ్యాడు. డీహైడ్రేషన్‌తో ఉన్నాడని ప్రధాన కోచ్ సంజయ్ బంగర్ చెప్పాడు. మ్యాచ్ సందర్భంగా తిరిగి వస్తుండగా వాంతి చేసుకున్నాడని పేర్కొన్నాడు. అయితే కోలుకునేందుకు సమయం ఉందని చెప్పాడు. మరో మ్యాచ్ ఆడే సమయానికి సెట్ అవుతాడని వెల్లడించాడు.

RCB తన తదుపరి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో మే 14న ఆడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. కార్తీక్ కోలుకుని ఆడుతాడో లేదో చూడాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. జరగబోయే మ్యాచ్ లు అన్నీ చాలా కీలకం.

WhatsApp channel

సంబంధిత కథనం