Cheer Leader in IPL: చీర్‌లీడర్ చేయి విరిగినా డ్యాన్స్ చేయిస్తారా.. సన్‌రైజర్స్‌పై ఫ్యాన్స్ సీరియస్-cheer leader in ipl with hand broken infuriates fans ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Cheer Leader In Ipl With Hand Broken Infuriates Fans

Cheer Leader in IPL: చీర్‌లీడర్ చేయి విరిగినా డ్యాన్స్ చేయిస్తారా.. సన్‌రైజర్స్‌పై ఫ్యాన్స్ సీరియస్

చేతికి కట్టుతోనూ చీర్ చేస్తున్న సన్ రైజర్స్ టీమ్ చీర్ లీడర్
చేతికి కట్టుతోనూ చీర్ చేస్తున్న సన్ రైజర్స్ టీమ్ చీర్ లీడర్

Cheer Leader in IPL: చీర్‌లీడర్ చేయి విరిగినా డ్యాన్స్ చేయిస్తారా అంటూ సన్‌రైజర్స్‌పై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఓ చీర్ లీడర్ చేతికి కట్టు కట్టుకొని కనిపించింది.

Cheer Leader in IPL: ఐపీఎల్లో సన్ రైజర్స్, గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో ఓ చీర్ లీడర్ ఫొటో ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఆ ఫొటోలో సదరు చీర్ లీడర్ చేయి విరిగినట్లు కనిపిస్తోంది. అయినా ఆమె కట్టు కట్టుకొని స్టేడియంలోని అభిమానులను చీర్ చేసింది. అలాంటి పరిస్థితుల్లోనూ ఆమెతో ఇలా చీర్ చేయిస్తారా? సిగ్గుండాలి అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

జీటీ ఇన్నింగ్స్ రెండు, మూడు ఓవర్లలో కెమెరాలు చీర్ లీడర్స్ వైపు చూపించినప్పుడు అందులో ఒకరు చేతికి కట్టుతో కనిపించారు. ఆమె చేతికి తీవ్ర గాయమైనట్లు దానిని చూస్తే స్పష్టమవుతోంది. అలా గాయం తగిలినా కూడా సదరు చీర్ లీడర్ బాగోగులు చూడకుండా ఆమెతో ఇలా డ్యాన్స్ చేయిస్తారా అంటూ సన్ రైజర్స్, ఐపీఎల్ నిర్వాహకులపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిగ్గుండాలి అంటూ ఓ అభిమాని ఈ ఫొటో షేర్ చేస్తూ ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటలోనే కాదు మానవత్వంలోనూ సన్ రైజర్స్ టీమ్ దిగజారిందా.. డబ్బు లేదా లేక చీర్ లీడర్స్ లేరా అంటూ మరో అభిమాని తన అసహనాన్ని వెల్లగక్కారు.

ఇక మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ చీర్ లీడర్ ను సన్ రైజర్స్ ప్లేయర్స్ తో పోలుస్తూ కామెంట్స్ చేయడం విశేషం. ఆ టీమ్ ప్లేయర్స్ కంటే చీర్ లీడర్స్ ఎక్కువ నిబద్ధతతో ఉన్నారని వాళ్లు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆమెతో బలవంతంగా ఇలా చేయించారా లేక ఆమెనే తనకు తానుగా తన బాధ్యతను నెరవేర్చిందా అంటూ మరో అభిమాని కామెంట్ చేశాడు.

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ ఓడిపోయింది. దీంతో ఆ టీమ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. అటు గుజరాత్ టైటన్స్ ఈ విజయంతో ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఓటమి చేదు అనుభవాన్ని మిగల్చడంతోపాటు ఈ చీర్ లీడర్ ఘటన కూడా సన్ రైజర్స్ జట్టుకు తలవంపులు తెచ్చిపెట్టింది.

WhatsApp channel

సంబంధిత కథనం