Virat Kohli: కోహ్లి అంకుల్.. వామికాను డేట్‌కు తీసుకెళ్లాలా.. చిన్నారి అభిమాని ప్లకార్డుపై నెటిజన్లు సీరియస్-can i take vamika on a date says a fans placard ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: కోహ్లి అంకుల్.. వామికాను డేట్‌కు తీసుకెళ్లాలా.. చిన్నారి అభిమాని ప్లకార్డుపై నెటిజన్లు సీరియస్

Virat Kohli: కోహ్లి అంకుల్.. వామికాను డేట్‌కు తీసుకెళ్లాలా.. చిన్నారి అభిమాని ప్లకార్డుపై నెటిజన్లు సీరియస్

Hari Prasad S HT Telugu
Apr 19, 2023 07:51 PM IST

Virat Kohli: కోహ్లి అంకుల్.. వామికాను డేట్‌కు తీసుకెళ్లాలా అంటూ ఓ చిన్నారి అభిమాని పట్టుకున్న ప్లకార్డుపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులకు కనీసం సెన్స్ లేదా అని ట్వీట్లు చేస్తున్నారు.

వామికాను డేట్ కు తీసుకెళ్లాలా అంటూ ఓ చిన్నారి పట్టుకున్న చిన్నారి
వామికాను డేట్ కు తీసుకెళ్లాలా అంటూ ఓ చిన్నారి పట్టుకున్న చిన్నారి (PTI-Twitter)

Virat Kohli: క్రికెట్ స్టేడియాల్లో కెమెరాల దృష్టిని ఆకర్షించడానికి అభిమానులు వింత వింత ప్లకార్డులు పట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక్కోసారి ఇది హద్దులు దాటుతుంది. తాజాగా ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ లో ఓ చిన్నారి అభిమాని పట్టుకున్న ప్లకార్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఆ చిన్నారి చేతుల్లో అలాంటి ప్లకార్డు పెట్టిన అతని తల్లిదండ్రులను నెటిజన్లు విమర్శిస్తున్నారు.

yearly horoscope entry point

ఆ ప్లకార్డు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ గారాల పట్టి వామికా గురించి రాసినది. అందులో ఏముందంటే.. "హాయ్ విరాట్ అంకుల్.. నేను వామికాను డేట్ కు తీసుకెళ్లొచ్చా?" అని రాసి ఉంది. నిజానికి ఓ చిన్నారి అలాంటి ప్లకార్డు పట్టుకుంటే క్యూట్ గా ఉంటుందని భావించి అతని తల్లిదండ్రులు అలా చేసి ఉండొచ్చు. కానీ నెటిజన్లకు మాత్రం ఇది నచ్చలేదు.

అంత చిన్న వయసులోనే ఆ చిన్నారికి ఇలాంటివి నేర్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క క్షణం కెమెరాలో కనిపించడానికి మరీ ఇంతలా దిగజారాలా.. ఆ పిల్లాడు ఎంతో అమాయకంగా కనిపిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. దీనివల్ల మీ డాడీ రెండు నిమిషాలు కెమెరాను ఆకర్షించాడేమోగానీ.. ఏ రకంగా చూసినా ఇది సరి కాదు అని మరో యూజర్ అన్నాడు.

చిన్నారి వామికాను ఉద్దేశించి ఇలాంటి ప్లకార్డు తయారు చేయడాన్ని అందరూ తప్పుబట్టారు. ఆ చిన్నారి జన్మించనప్పటి నుంచీ విరాట్, అనుష్కలు కెమెరా కంట పడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆమెకు తగిన ప్రైవసీ ఇవ్వాలని వాళ్లు కోరుతూ వచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం